Vastu Tips: ఇంట్లో సిరి–సంపద రావాలంటే ఈ వాస్తును పాటించాలి!

Vastu Tips: నేటి సమాజంలో డబ్బుంటేనే మనిషికి విలువ ఉంటుంది. అది మనిషి జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తోంది. ఏ ఒక్కరూ కూడా డబ్బు లేకున్నా నేను జీవించగలను అనడం ఎవరి తరం కాదు. అందుకు డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకుంటే పొదుపు చేయాలంటుంటారు పెద్దలు. ఇంట్లో సిరి–సంపదల విషయంలోనూ వాస్తు ఎంతో ముఖ్యమంటున్నారు వాస్తు నిపుణులు. ఇంటి వాస్తు కూడా ఆ ఇంట్లో ఉండే వారి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది.

ప్రతి ఇంటి నిర్మాణంలో ఐదు అంశాలు, 16 మహావాస్తు జోన్లు కీలకంగా ఉంటాయి. అందుకే వాస్తు నిపుణులను సంప్రదించి వీటిపట్ల జాగ్రత్తగా ఉంటే ఇంట్లో సిరి సంపదలకు కొదవే ఉండందంటున్నారు నిపుణులు. కొందరు ఇళ్లు నిర్మించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. అలాంటివారు ముందుగా వాస్తు గురించి అవగాహన తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఉత్తర వాస్తు జోన్‌ రంగు అనేది చాలా ముఖ్యమైనదని వాస్తు నిపుణులు చెబగుతుంటారు. అందు వైపు ఉన్న గోడకు నీలి రంగు వేయడం మంచిదని చెబుతున్నారు. ఎరుపు రంగు వంటివి వేయొద్దని సూచిస్తున్నారు. ఇంట్లో వంటగది, బాత్‌రూమ్‌కు ప్రత్యేక ప్రాంతం అవసరం. ఈ ప్రాంతాల్లో డస్ట్‌బిన్స్, వాషింగ్‌ మిషిన్స్‌ సహా ఇతర ఎలక్ట్రానిక్స్‌ పెట్టొద్దట. ముఖ్యంగా వంటగది స్థానం మార్చడం సరికాదని సూచిస్తున్నారు. వంటగది మంటను సూచిస్తుందని అందుకే తప్పుడు ప్రాంతంలో కిచెన్‌ పెట్టడం వల్ల సంపద, అవకాశాలు హరించుకుపోతాయనే సంకేతాలు వస్తాయని చెబుతున్నారు.

వంటగది ఇంటికి ఆగ్నేయంగా ఉండాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. వంటగదికి నారిజ, గులాబీ రంగులు వేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇంట్లో సంపద కళకళలాడాలంటే.. వర్క్‌ టేబుల్, డ్రాయింగ్‌ రూం వంటివాటిని ఉత్తర దిశలో పెట్టడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఇంటికి పశ్చిమ వైపు తెలుపు, పసుపు రంగులు వేయడం శుభసూచికాలట. నైరుతి జోన్‌ను పొదుపు జోన్‌గా పరిగణిస్తుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ప్రాంతంలో డబ్బుకు సంబంధించిన వస్తువులు గానీ.. ఇతర విలువైన వస్తువులు పెట్టడం చాలా మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -