FOOTBALL: ఫుట్ బాల్ మ్యాచ్ గురించి ఆసక్తికరమైన ఈ విషయాలు మీకు తెలుసా?

FOOTBALL: అసలు ఫుట్ బాల్ గేమ్ క్రీస్తుపూర్వం 476లో చైనాలో మొట్టమొదటిసారిగా మొదలైంది. కానీ ఈ ఆటను అమెరికా మరియు యూరప్ దేశాలలో ఎక్కువగా ఆడుతారు. ఫుట్ బాల్ చూడడానికి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే ఆటగా ఎందరో అభివర్ణిస్తారు.

 

ప్రపంచంలో అత్యధిక వ్యూవర్స్ ఉన్న ఆట ఫుట్ బాల్. ఒకరకంగా చెప్పాలి అంటే క్రికెట్ కన్నా ఎక్కువ ఫాన్స్ ఉన్న ఆట ఫుట్ బాల్. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా ,పరోక్షంగా 200 కోట్లకు పైగా అభిమానులు వీక్షించారు అంటే ఫుట్ బాల్ క్రేజ్ ఎలా ఉందో ఆలోచించండి.

 

ఫుట్ బాల్ మైదానంలో మ్యాచ్ జరిగే సందర్భం లో ఒక ఆటగాడు సగటున 9.65 కిలోమీటర్ల వరకు పరిగెత్తాల్సి ఉంటుంది. మనం ఎక్కువగా ఫుట్ బాల్ అనిపించే ఈ ఆటను అమెరికన్లు మరియు కెనడియన్లు సాకర్ అని కూడా పిలుస్తారు.

 

ప్రపంచంలో 80 శాతం వరకు ఉపయోగించే ఫుట్ బాల్ తయారయ్యేది పాకిస్తాన్ నుంచి. ఫుట్ బాల్ ఒక్క చుట్టుకొలత 28 అంగుళాలు ఉంటుంది. గత 120 సంవత్సరాల నుంచి ఈ పరిమాణంలో ఎటువంటి మార్పు లేదు. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజమే. ఫుట్ బాల్ కి సంబంధించిన తొలి మ్యాచ్ 1937లో టీవీ లో ప్రసారం చేశారు. కానీ అది ఏ సిరీస్ మ్యాచ్ కాదు కేవలం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే.

 

ఫిఫా ఫుట్ బాల్ మ్యాచ్లో ఇంచుమించు 30 దేశాలకు పైగా రెగ్యులర్గా పాల్గొంటాయి. కానీ ఇప్పటివరకు జరిగిన అన్ని ఫిఫా మ్యాచులలో టైటిల్ గెలుచుకున్నవి కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే. బ్రెజిల్ ,జర్మనీ ,అర్జెంటీనా , ఫ్రాన్స్, ఇటలీ ,ఉరుగ్వే ,ఇంగ్లాండ్ మరియు స్పెయిన్ ఇప్పటివరకు కప్పును కైవసం చేసుకుంటూ వచ్చాయి.

 

అందరికంటే అత్యధికంగా బ్రెజిల్ ఇప్పటికి ఐదు సార్లు ఫిఫా టైటిల్ సొంతం చేసుకుంది. జర్మనీ మరియు ఇటరి నాలుగు సార్లు కప్ కైవసం చేసుకోగా, అర్జెంటీనా ,ఫ్రాన్స్ మరియు ఉరుగ్వే రెండుసార్లు కప్పును తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇంగ్లాండ్ మరియు స్పెయిన్ ఇప్పటివరకు చెరొకసారి కప్ ను గెలుచుకున్నాయి.

 

1942లో ఫ్రాన్స్ ఆటగాడు స్టీఫెన్ స్టోనిస్ ఒక మ్యాచ్లో ఏకంగా 16 గోల్స్ సాధించి రికార్డు సృష్టించాడు. 1999 లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. బ్యాంకాక్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో 5,098 జట్లు మరియు 53 వేల ఆటగాళ్లు పాల్గొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -