Dalits: దళితులకు రు. 10 లక్షలిచ్చి బీసీలకు లక్ష.. ఇదేం అన్యాయమంటూ?

Dalits: వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ను బంధువులే ముంచేస్తాయి అన్న అనుమానాలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. తొందరలోనే దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కేసీఆర్ ఈమధ్యనే ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆదేశాలైతే ఇచ్చారు కానీ ఆచరణ ఎలాగో మాత్రం చెప్పలేదు. ఎందుకంటే దళితబంధు పథకం అమలుకు కనీసం రూ. 20 వేల కోట్లు కావాలి. అంతడబ్బు ప్రభుత్వం దగ్గర లేదన్నది వాస్తవం. ఈ పథకాన్ని పక్కన పెట్టేస్తే బీసీ బంధు పథకం అమలుకు కూడా కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.

అయితే విచిత్రం ఏమిటంటే పథకాల అమలుకు తగినంత నిధులు ప్రభుత్వం దగ్గర లేకుండానే పథకాలను పక్కాగా అమలుచేసేయాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు 2022-23 ఆర్ధిక సంవత్సరంలోనే రెడీ అయ్యారు. అయితే ఒక్క లబ్దిదారుడికి కూడా పథకంలో డబ్బులు అందలేదు. కారణం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర అవసరమైన రూ. 17 వేల కోట్లు లేకపోవటమే. తర్వాత 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కూడా దళితబంధుకు ప్రభుత్వం రు. 17,500 కోట్లను కేటాయించినప్పటికీ ఇంతవరకు పథకం అమలు కాలేదు. అందుకు కారణం ఏమిటంటే డబ్బులు లేకపోవటమే. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే.

 

మరి అటువంటప్పుడు ఇలాంటి పథకాలను ప్రకటించటం ఎందుకు, అమలు విషయంలో గాలిమాటలు చెప్పటం ఎందుకు? నిజానికి హుజూరాబాద్ ఉపఎన్నికలోనే దళితబంధు పథకం ప్రకటించి కొంత హడావుడి చేశారు కేసీఆర్. కొందరికి డబ్బులు ఇచ్చి, కొందరికి ఇవ్వక నానా గోలైంది. మొత్తానికి ఎవరూ బీఆర్ఎస్ కు ఓటేయకుండా బీజేపీ తరపున పోటీచేసిన ఈటల రాజేందర్ ను గెలిపించారు. ఈటల గెలుపుతో మండిపోయిన కేసీయార్ తర్వాత పథకం అమలుపై పెద్దగా శ్రద్ధపెట్టలేదు. అయితే మళ్ళీ ఎన్నికలు వస్తున్న నేపధ్యంలోనే దళితబంధని, బీసీబంధని హడావుడి మొదలుపెట్టారు. దళితబంధులో ప్రతి లబ్దిదారుడికి రు. 10 లక్షలయితే బీసీబంధులో లబ్దిదారుడికి లక్ష రూపాయలు. ఇక్కడే బీసీ సంఘాల నుండి నిరసన వ్యక్తమవుతోంది. దళితులకు రు. 10 లక్షలిచ్చి తమకు మాత్రం లక్ష రూపాయలే ఏందని గోలచేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -