Balayya: బాలయ్యను మెచ్చుకున్న మాజీ సీఎం చంద్రబాబు.. ఏం జరిగిందంటే?

Balayya: నందమూరి తారకరామారావు సతీమణి బసవతారకం పేరు మీదుగా హైదరాబాద్లో స్థాపించినటువంటి బసవతారకం హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడ్డారు అంటే వెంటనే బసవతారకం హాస్పిటల్ ఎదుట నిలబడతారు. అత్యంత తక్కువ ధరలకే అత్యాధునిక టెక్నాలజీతో క్యాన్సర్ కి చికిత్స అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేస్తుంది ఈ బసవతారకం హాస్పిటల్.

ఇక ఈ హాస్పిటల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు హాస్పిటల్ కి పర్యవేక్షిస్తూ హాస్పిటల్ కి కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూరుస్తూ ఉంటారు. అదే విధంగా హాస్పిటల్ కోసం పెద్ద ఎత్తున విరాళాలను కూడా ఈయన సేకరిస్తూ అన్ని వసతులను సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.ప్రజలకు అద్భుతమైన వైద్యాన్ని అందిస్తున్నటువంటి బసవతారకం హాస్పిటల్ దేశంలోనే అత్యుత్తమమైన సేవలు అందించే క్యాన్సర్ హాస్పిటల్స్ లో రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది.

 

ప్రముఖ మ్యాగజైన్ ఔట్ లుక్ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం అందించే ఆస్పత్రులలో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో బసవతారకం హాస్పిటల్ చోటు సంపాదించుకుంది. క్యాన్సర్ ఆస్పత్రి నిర్వహణలో బాలకృష్ణ తీరు ఔట్ లుక్ పత్రిక ప్రశంసించింది. నిరుపేదలకు అతి తక్కువ ధరకే అద్భుతమైన క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారని కొనియాడింది.

 

ఈ విధంగా బసవతారకం హాస్పిటల్ దేశంలోనే నెంబర్ 2 స్థానంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం వెనుక బాలకృష్ణ కృషి కష్టం ఎంతో ఉందని చెప్పాలి. ఇక ఈ హాస్పిటల్ కి ఇంత మంచి గుర్తింపు రావడంతో ఈ ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ నందమూరి బాలకృష్ణ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.క్యాన్సర్ చికిత్సలో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక చికిత్స పద్దతుల్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ మంచి వైద్య సేవలు అందిస్తున్నారని చంద్రబాబు నాయుడు కొనియాడారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -