Chandrababu: బూమ్ బూమ్ బీర్ల కేసుతో చంద్రబాబు భవిష్యత్తుకు ప్రమాదమా.. ఏం జరిగిందంటే?

Chandrababu: చంద్రబాబు ఇప్పుడు ఉన్న కేసులతోనే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అలాంటిది సిఐడి చంద్రబాబుపై మరో కేసు బనాయించింది. చంద్రబాబుని చేసిన పాపాలు ఈ రూపంలో వెంటాడుతున్నాయి అంటూ ఎద్దేవా చేస్తున్నారు చంద్రబాబు వ్యతిరేకులు. ఇక అసలు విషయంలోకి వస్తే గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదయింది.

పిసి యాక్షన్ కింద చంద్రబాబు పై కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు చంద్రబాబుని కేసులో ఏ 3 గా చేర్చారు. మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే అంశంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు ఏపీ బీసీఎల్ ఎండి. రెండు బేవరేజీలు మూడు డిస్ట్రిలరీ ల కోసం 2012 లో మద్యం పాలసీలని మార్చేశారు. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారు. చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్,ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్.

పవర్ స్టార్ 999, రష్యన్ రామనోవ, ఏసీబీ, 999 లెజెండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హ్యాంగర్ వంటి 254 బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో తన దగ్గరే నేత రుణం తీర్చుకున్నారు. విశాఖ డిస్టిలరీ 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. ఇది తెదేపా నేత అయ్యన్న పాత్రుడుకి చెందిన కంపెనీ. చంద్రబాబు పాలన అయిపోగానే దాన్ని అమ్మేశారు.అలాగే పిఎంకె డిష్టిలరీ పార్టీలోని ఒక సీనియర్ నేత వియ్యంకుడిదని తెలుగుదేశంలోనే ప్రచారం ఉంది.

అంతేకాకుండా 1982 కు ముందు కేవలం 5 డిస్టినరీలే ఉండేవి. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిసి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. వీటితోపాటు మరికొన్ని అంశాలని చేర్చుతూ ఏసీబీ కోర్టుకు సిఐడి అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసు కు సంబంధించి విచారణ జరపాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -