Chiranjeevi: అటు చిరంజీవి ఫ్యాన్స్.. ఇటు బ్రాహ్మణులు.. ఎవ్వరు తగ్గట్లేదుగా?

టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు. సినీ ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో అడుగుపెట్టిన చిరు.. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవి మీద గరికపాటి నరసింహారావు ఒక విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిపై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిరంజీవి చుట్టూ చేరి తన లేడీ అభిమానులు ఫోటోలు దిగుతూ ఉండగా అది చూసిన గరికపాటి అసహనం వ్యక్తం చేశాడు. మీ ఫోటో సెషన్ ఆపకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతా అని బెదిరించాడు. ఇక గరికపాటి మాటతో ఫోటో సెషన్ అక్కడికక్కడే ఆపేసారు. ఆ తర్వాత గరికపాటి తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు.

మరి గరికపాటి ఈ విషయంలో ఎందుకు వెలితి పడ్డాడో కానీ మెగా అభిమానులు మాత్రం గరికపాటి పై ఒక రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. తాజాగా చిరంజీవి బ్రదర్ నాగబాబు కూడా ట్విట్టర్ ఖాతా రూపంలో ఒక కౌంటర్ వేశాడు. చిరంజీవి ఎదుగుదలని చూస్తే ఏపాటి వాడికైనా.. ఈపాటి అసూయ కలగడం కామన్ అన్నట్లుగా సెటైర్ వేశాడు. ప్రస్తుతం నాగబాబు వేసిన సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు రంగంలోకి దిగాయి. గరికపాటికి మద్దతుగా నిలిచాయి. సినిమాల పేరుతో వ్యాపారం చేసుకునే వాడికి, ప్రవచనాలు చెప్పుకునే పండితుడికి పోలిక ఏంటి అంటూ మరింత దెప్పి పొడిచిన విధంగా మాట్లాడారు. నిజానికి అలయ్ బలయ్ కార్యక్రమంలో జరిగిన ఈ చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేస్తున్నారు. గోటితో పోయే విషయాన్ని గరిక పాటి గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లయ్యింది. ప్రస్తుతం గరికపాటి చేసిన వ్యాఖ్యలను మెగా అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు బ్రాహ్మణ సంఘాలు గరికపాటికి మద్దతుగా నిలిచి ధుమారం రేపుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -