Funeral: అంత్యక్రియలు జరుగుతుండగా బతికి వ్యక్తి..బంధువులు షాక్

Funeral: అంత్యక్రియలు చేస్తుండగా మనిషి బతికిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. పుదుకోట జిల్లాలోని ఆలంపట్టి మురండాంపట్టి గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి బతకడంతో అందరూ షాక్ అయ్యారు. 60 ఏళ్ల రైతు షణ్ముగం అనే వ్యక్తికి గుండె, లివర్ సమస్య ఉంది. ఆ ఇబ్బందితో ఉన్న వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

 

కుటుంబీకులు ఆయన్ని వెంటనే పొన్నమరావతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడని అందరూ అనుకున్నారు. కుటుంబ సభ్యులు అతన్ని తిరిగి గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు ఆ ఇంటికి చేరారు. కుటుంబీకులను ఓదార్చారు.

బంధువులు కూడా ఇంటికి వచ్చి షణ్ముగం కుటుంబీకులను ఓదార్చారు. అంత్యక్రియలకు ఏమేం చేయాలో చేస్తూ బంధువులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత షణ్ముగం మృతదేహాన్ని ఇంటిబయట తిన్నెపై కూర్చోబెట్టి జరగాల్సిన కార్యక్రమం చేపట్టారు. ఆచారం ప్రకారంగా షణ్ముగం కొడుకు ఆఖరి సారి తండ్రి నోట్లో పాలు పోశాడు. ఆ పాలు నోట్లోకి వెళ్లీ వెళ్లగానే షణ్ముగం ఒక్కసారిగా దగ్గుతూ కళ్లు తెరవడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.

 

ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందంతో అందరి కళ్లు మెరిశాయి. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి బతికాడని అందరూ కోడై కూశారు. కుటుంబీలకు ఆయన బతికాడని సంతోషంలో ఉబ్బితబ్బిబ్బైపోయారు. అయితే షణ్ముగం నిజంగానే చనిపోయాడా? లేకుంటే బతికి ఉండగానే ఆయనకు అంత్యక్రియలు చేశారనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సంఘటన కలకలం రేపుతోంది. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి బతికొచ్చాడని స్థానికులు షణ్ముగం గురించి చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -