Gaddar: గద్దర్ నామినేషన్ వ్యవహారంలో ట్విస్ట్.. ఆయనను బెదిరించారా?

Gaddar: మునుగోడు ఉపఎన్నికల కోసం ప్రజాశాంతి అభ్యర్థిగా ప్రజాయుద్దనౌక గద్దర్ పేరును కేఏ పాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నేటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియగా.. గద్దర్ నామినేషన్ వేయలేదు. దీంతో అసలు ఏమైందనే చర్చ తెరపైకి వచ్చింది. ఆయన ఎందుకు నామినేషన్ వేయలేదనేది చర్చనీయాంశంగా మారింది. గద్దర్ ను ప్రజాశాంతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన ఎక్కడా మీడియాతో ప్రకటించలేదు. నామినేషన్ కూడా వేయకపోవడంతో అసలు ఏం అయిందనే చర్చ జరిగింది. ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరడంతో మునుగోుడు అభ్యర్థిగా ప్రకటించారు. కానీ నామినేషన్ వేయకపోవడతో గద్దర్ కావాలనే తప్పుకున్నారా అనే చర్చ జరుగుతోుంది.

ప్రజాశాంతి పార్టీని ఇన్ యాక్టివ్ పార్టీల జాబితాలో ఈసీ ఉంచింది. ప్రజాశాంతి పార్టీ పత్రాలు సమర్పించినా ఇంకా ఆ పార్టీని యాక్టివ్ పార్టీగా ప్రకటించలేదు. దీంతో అందుకే గద్దర్ నామినేషన్ వేయలేదనే టాక్ నడుస్తోంది. కానీ చివరి నిమిషంలో ప్రజాశాంతి అభ్యర్థిగా కేఏ పాల్ నామినేషన్ వేశారు. ప్రజాశాంతి పార్టీ ఇన్ యాక్టివ్ పార్టీల జాబితాలో ఉంటే ఆయన నామినేషన్ ఎలా వేశారనేది అర్ధం కావడం లేదు. దీంతో కేఏ పాల్ నామినేషన్ చెల్లుతుందా.. లేదా అనేది అర్ధం కావడం లేదు. శుక్రవారం నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ముగియనున్న క్రమంలో కేఏ పాల్ చండూరులోని ఎమ్మార్వో కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.

మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి అభ్యర్థిగా కేఏ పాల్ నామినేషన్ వేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధాకారికి నామినేషన్ పత్రాలు అందించారు. గద్దర్ నామినేషన్ వేయకుండా బెదిరించారని, గద్దర్ నామినేషన్ వేయకుండా అడ్డుకును్నారని కేఏ పాల్ తెలిపారు. గద్దర్ ను నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో తాను నామినేషన్ వేసినట్లు కేఏ పాల్ తెలిపారు. కానీ ప్రజాశాంతి తరపున నామినేషన్ వేసేందుకు గద్దర్ ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఇటీవల కేఏ పాల్ ను కలిసేందుకు గద్దర్ ఆయన కార్యాలయానికి వెళ్లారు. కానీ ఏమైందో ఏమీ కాని కేఏ పాల్ ను కలవకుండానే వెనుతిరిగారు. ఆ తర్వాత ఇక మీడియాలో గద్దర్ ఎక్కడా కనిపించలేదు.

ఈ తరుణంలో స్వయంగా కేఏ పాల్ నామినేషన్ వేయడం. గద్దర్ ను ప్రభుత్వం బెదిరించిదని కామెంట్స్ చేడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కేఏ పాల్ ఒక్కసారిగా మెరిశారు. మునుగోడులో ఇఫ్పటికే అనేకసార్లు పర్యటించారు. తన బర్త్ డే సందర్భంగా మునుగోడులో ఆస్పత్రి ప్రారంభానికి శంకుస్థాపన చేశారు కొంతమంది యువకులను ఎంపిక చేసి అమెరికా వీసా ఉచితంగా ఇప్పించేలా ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ మునుగోడులో కేఏ పాల్ హీట్ పుట్టిస్తున్నారు. కేసీఆర్ తమ పార్టీని చూసి భయపడుతున్నారని,తమ పార్టీ గుర్తు వేరేవాకికి వచ్చేలా నామినేషన్లు వేయిస్తున్నాని తెలిపారు. మునుగోడులో తమ పార్టీ గెలిస్తే విదేశాల నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అభివద్ది చేస్తానంటూ చెప్పుకొస్తున్నారు. మునుగోడు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ హమీలు ఇస్తున్నారు.ఏది ఏమైనా మునుగోడు ఉపఎన్నికల్లో కేఏ పాల్ హల్ చల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -