Game On: ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గేమ్ ఆన్ మూవీ సెకండ్ లిరికల్ సాంగ్?

: గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఆన్. ఈ సినిమాకు దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌ పై ద‌యానంద్ ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా తమ్ముడు దయానంద్ దర్శకత్వం వహిస్తుండగా గీతానంద్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఇందులో మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఇలా ఉండే తాజాగా ఈ సినిమా నుంచి పడిపోతున్న అనే సెకండ్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటకు అశ్విన్, అరుణ్ సంగీతం అందించారు. అలాగే అనురాగ్ కులకర్ణి, హారిక నారాయణ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది.

ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ సాంగ్ ని విడుదల చేసిన సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. గతంలో విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నవాబ్ గ్యాంగ్ మా సినిమా కోసం మంచి సంగీతాన్ని అందించారు. బిజీ బిజీ లో ఉన్నప్పటికీ మా సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తాజాగా రిలీజ్ చేసిన రెండో పాటకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ స్పందనతో సినిమాపై నమ్మకం మరింత పెరిగింది. ఈ సినిమా కోసం ఇద్దరు అన్నదమ్ములు కలిసి పనిచేస్తున్నారు. ఒకరు డైరెక్షన్ చేస్తుండగా మరొకరు హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పని చేశాము అని చెప్పుకొచ్చారు రవి కస్తూరి.

అనంతరందర్శకుడు ద‌యానంద్ మాట్లాడుతూ రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ప్రస్తుతం డిఫ‌రెంట్ సినిమాలు రావడంతో పాటు స‌క్సెస్ అవుతున్నాయి. అటువంటి సినిమాలు మార్క్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవ‌లోనే గేమ్ ఆన్ సినిమా కూడా ఉంటుంద‌ని భావిస్తున్నాను. ట్విస్టులు, ట‌ర్నులతో ఆధ్యంతం ఆకట్టుకోబోతోంది.
మేము చెప్పిన కథ విని చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు దయానంద్. మరి ముఖ్యంగా మా బ్రదర్ పై నమ్మకం పెట్టి ఈ కథ రాసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమాకు హీరోగా, దర్శకుడుగా మేము ఇద్దరు అన్నదమ్ములం పోటీగా వర్క్ చేస్తున్నాము. ఈ సినిమాలో యాక్ష‌న్‌, రొమాన్స్, ఎమోష‌న్స్. అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటాయి చెప్పుకొచ్చారు దయానంద్.

న‌టీన‌టులు: గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, వాసంతి, కిరిటీ, శుభ‌లేక సుధాక‌ర్‌ త‌దిత‌రులు.

బ్యాన‌ర్స్‌: క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్‌, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌: ర‌వి క‌స్తూరి
ద‌ర్శ‌క‌త్వం: ద‌యానంద్‌
మ్యూజిక్‌: న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ – అరుణ్‌
సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌
డైలాగ్స్‌: విజ‌య్ కుమార్ సి.హెచ్‌
ఒరిజిన‌ల్ బ్యాగ్రౌండ్ స్కోర్‌: అభిషేక్ ఎ.ఆర్‌
ఎడిట‌ర్ : వంశీ అట్లూరి
ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌: దిలీప్ జాన్‌, రాజ్ క‌మ‌ల్‌
స్టంట్స్‌: రామ‌కృష్ణ‌న్‌, న‌భా స్టంట్స్‌
కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌
పి.ఆర్‌.ఒ: మధు వి. ఆర్.

Related Articles

ట్రేండింగ్

Sonu Sood: సోనూసూద్ ను కలవడానికి నడిచి వెళ్లిన వ్యక్తి.. చివరకు?

Sonu Sood: సోనూసూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరోనా అలాంటి విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి అండగా నిలిచి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది...
- Advertisement -
- Advertisement -