Bangalore: యువతీని కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్?

Bangalore: దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిత్యం ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేక పోతోంది. దాంతో కామందులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రోడ్డు మీద ఆడది కనిపించింది అంటే చాలు క్రూర మృగాలుగా మారుతున్నారు.

 

తాజాగా కొందరు దుర్మార్గులు కదులుతున్న కారులో యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల రాత్రి సమయంలో ఒక యువతి తన స్నేహితుడితో కలిసి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో గల నేషనల్ గేమ్స్‌ విలేజ్‌ పార్కులో కూర్చొని మాట్లాడుతోంది. ఆ సమయంలో వారి వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వచ్చి రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటూ బెదిరింపులకు దిగాడు. దాంతో భయపడిపోయిన యువతి స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు యువతి అక్కడి నుండి పారిపోదాం అనుకుంటే ఆ వ్యక్తి అడ్డుపడ్డాడు.

చుట్టూ ఎవరు లేక పోవడంతో అతను మరో ముగ్గురిని ఫోన్‌ చేసి అక్కడికి రప్పించాడు. అప్పుడు ఆ నలుగురు యువకులు కలిసి ఆమెను బలవంతంగా పార్కులో నుంచి ఈడ్చుకెళ్లి వాళ్ల కారులోకి ఎక్కించుకొని నలుగురు కామాంధులు కలిసి దొమ్మలూరు, ఇందిరానగర్, అనేకల్, నైస్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో యువతిని కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా కారుని రోడ్డుపై తిప్పుతూనే ఆ యువతిపై అత్యాచారానికి ఒడిగడుతూ వచ్చారు. అనంతరం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాధితురాలిని తన ఇంటి సమీపంలో విడిచిపెట్టారు.

 

ఆ విషయాన్ని బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ యువతీని బెదిరించారు. ఆ యువతి నీరసంగా ఉండటం, పరిస్థితి గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం స్ప్రుహలోకి వచ్చిన బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులు కోరమంగళ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ సహాయంతో సతీశ్​, విజయ్, శ్రీధర్, కిరణ్ అనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే, ఈ దుశ్చర్యకు పాల్పడ్డ నలుగురు నిందితులు బాధితురాలు ఉంటున్న ప్రాంతంలోనే నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి సంబంధించి మెడికల్​ రిపోర్ట్స్ రావాల్సి ఉందని డీసీపీ సీకే బాబా మీడియాకు వెల్లడించారు.

 

Related Articles

ట్రేండింగ్

Chamundeshwari Stotram: ఈ స్తోత్రం చదివితే కష్టాలు కచ్చితంగా తీరతాయి.. దేవి అనుగ్రహంతో?

Chamundeshwari Stotram: కష్టం వస్తే దేవుని వైపు చూడడం మానవుని సహజలక్షణం. అందులోని అమ్మవారి స్తోత్రాలు మరింత శ్రేష్టమైనది. అందులోనే చాముండేశ్వరి మంగళ స్తోత్రం కూడా ఒకటి. ఈ స్తోత్రం చదివితే కష్టాలు...
- Advertisement -
- Advertisement -