Allu Arjun – Aditi Agarwal: గంగోత్రి హీరోయిన్ తో అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటోలు?

Allu Arjun – Aditi Agarwal: అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ సోదరి ఆదితి అగర్వాల్ సందడి చేశారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే.

గంగోత్రి సినిమా తర్వాత అదితి అగర్వాల్ పలు సినిమాలలో నటించి ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై విదేశాలలో స్థిరపడ్డారు.అల్లు అర్జున్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ చిత్రం నిర్మాణ పనులు కాస్త ఆలస్యం కావడంతో ఈయన తరుచూస్తున్న ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే తన భార్య పిల్లలతో కలిసి ప్రస్తుతం పారిస్ హాలిడే వెకేషన్ లో ఉన్నారు. ఇక ఈ ఫ్యామిలీతో కలసి ప్యారిస్ అందాలను చూస్తూ క్యూట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్యారిస్ లో మొదటి హీరోయిన్ అదితి అగర్వాల్ కలిసినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే తనతో కలిసి దిగిన ఫోటోలను అదితి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఆదిత్య అగర్వాల్ అల్లు అర్జున్ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ 18 ఏళ్ల తర్వాత ఇలా అల్లు అర్జున్ ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ కోస్టార్, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ఈ ఫోటోలను షేర్ చేస్తూ గంగోత్రి డేస్ గుర్తుకొస్తున్నాయి అంటూ అదితి అగర్వాల్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలలో వీరిద్దరూ బ్లాక్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ లో ఉన్నారని చెప్పాలి.మొత్తానికి ఇలా అల్లు అర్జున్ తన మొదటి హీరోయిన్ తో కలిసి దిగిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -