Garikapati-Chiranjeevi: మెగాస్టార్ పై గరికపాటి ఫైర్.. అసలేం జరిగిందంటే?

Garikapati-Chiranjeevi: హైదరాబాద్ లో ఏటా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రముఖులు పాల్గొంటుంటారు. తెలంగాణలో పర్వదినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకొనేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమమే అలయ్ బలయ్. దసరా సందర్భంగా ఏటా నిర్వహిస్తుంటారు. పండుగ తర్వాత రోజు బంధు మిత్రులు కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకుంటూ కౌగిలించుకొని అలయ్ బలయ్ అని చెప్పుకుంటుంటారు. ఇది చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఆచారం.

దసరా సందర్భంగా ఈసారి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఈయనతోపాటు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వేదిక వద్దకు రాగానే అభిమానులు ఆయన్ను చుట్టు ముట్టారు. ఫొటోలు, సెల్ఫీలంటూ గోల చేయడం మొదలు పెట్టారు. అయితే, ఈ సమయంలో గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తున్నారు. దీంతో ఈ తంతును గమనించిన గరికపాటి వారికి ఆగ్రహావేశాలు ముంచుకొచ్చాయి.

చిరంజీవిగారూ… మీరు ఫొటో షూట్ ఆపివేస్తారా.. అని నేరుగా ప్రశ్నించారు గరికపాటి. మీరు ఆపేస్తే నేను మాట్లాడుతా.. లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ మొహమాటం లేకుండా మైకులోనే చెప్పేశారు. అక్కడ మొత్తం ఫొటో షూట్ అయిపోతేనే నేను ప్రసంగిస్తా.. చిరంజీవి గారికి వినతి.. దయచేసి ఫొటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి.. అంటూ మైకులో చెప్పేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ప్రముఖులు వెంటనే కలుగజేసుకొని చిరంజీవి చుట్టూ మూగిన అభిమానులను కట్టడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ వాతావరణం సద్దుమణిగింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -