Chiranjeevi-Garikapati: చిరంజీవికి వార్నింగ్ ఇచ్చిన గరికపాటి.. అసలు ఏం జరిగిందంటే?

Chiranjeevi-Garikapati: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. అయితే ప్రముఖ రాజకీయవేత్త, మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఆలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నాడు.

ఈ వేడుకలో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ గరికపాటి నరసింహారావు గారు కనిపించగానే అతడి ప్రసంగాన్ని ఎంతో పొగిడాడు. అంతేకాకుండా దాదాపు మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకేలా ఉంటాయని తెలిపాడు. అంతేకాకుండా నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను అని తెలిపాడు. ఇక మిమ్మల్ని వీలు చూసుకుని మా ఇంటికి కూడా తీసుకువెళతాను అని చిరంజీవి ఆ వేడుకలో అన్నాడు.

చిరంజీవి తన ప్రసంగాన్ని ఆపేసిన తర్వాత లేడీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చిరంజీవి దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. వారు అలా ఫొటోలు దిగుతుండగా.. అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఆగితే నేను మాట్లాడతాను, లేకపోతే వెళ్ళిపోతానని గరికపాటి అన్నాడు. చిరంజీవి గారు దయచేసి ఫొటో సెషన్ ఆపి పక్కకు రండి.. నేను మాట్లాడతాను. చిరంజీవికి విన్నపం, ఫోటోసెషన్ ఆపి ఇక్కడికి రావాలి. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి అంటూ గరికపాటి వార్నింగ్ ఇచ్చినట్లు చిరంజీవితో అన్నాడు.

ఇక ప్రస్తుతం గరికపాటి చిరంజీవిపై ఆగ్రహంగా చేసిన వాక్యలు వైరల్ గా మారాయి. ఈ విషయం గమనించిన చిరంజీవి అభిమానులు గరికపాటి పై ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి గారు గరికపాటి గురించి ఎంత మంచిగా సంబోధించినప్పటికీ తనపై ఇంత కోపం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటి? అసలు గరికపాటికి ఏమాత్రమైనా బుద్ధి ఉందా అన్నట్లు మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి మెగా అభిమానులు గరికపాటి పై చేసే వ్యాఖ్యలకి చిరంజీవి ఏ విధంగా స్పందిస్తాడో చూడాల్సి ఉంది. ఏదేమైనా గరికపాటి మాత్రం ఆ వేడుకలో చిరంజీవిపై కొంచెం దురుసుగానే ప్రవర్తించాడు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -