Amazon: రూ.17 వేల లోపు 4కే స్మార్ట్ టీవీ దక్కించుకోండిలా..

Amazon: ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్స్ నడుస్తోంది. ఈ నెల 23వ తేదీ వరకు ఫెస్టివల్ సేల్స్ కొనసాగనుంది. కాగా, గత నెల 23వ తేదీన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. అయితే ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్ నడుస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తున్నాయి. రూ.20 వేల లోపు 4కే స్మార్ట్ టీవీలు కొనాలని అనుకునే వారికి రూ.17వేల లోపు ధరకే కొనుగోలు చేయగలరు.

ఐ ఫాల్కన్ 43యూ61 స్మార్ట్ టీవీ..

ఐ ఫాల్కన్ 43యూ61 43 ఇంచుల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. ఈ టీవీని రూ.17,999కే కొనుగోలు చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ బ్యాంకుల క్రెడిట్ కార్డుతో రూ.1,250 తగ్గింపు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఆ టీవీని రూ.16,749కే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 3840×2160 పిక్సెల్స్ తో 4కే రెజల్యూషన్ ఉండే 43 ఇంచుల డిస్‌ప్లేను ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉంది. 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10 సపోర్ట్, మైక్రో డిమ్మింగ్ ఫీచర్లు కలిగి ఉంటాయి.

ఐ ఫాల్కన్ 43 యూ61 స్మార్ట్ టీవీలో 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. అలాగే ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇంటర్నేట్‌లో పాపులర్ ఓటీటీ యాప్స్ టీవీలో రన్ చేయవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్రోమ్ కాస్ట్ వంటి వాటిని వినియోగించవచ్చు. వీటితోపాటు గూగుల్ ప్లే స్టోర్‌లో సపోర్ట్ చేసే యాప్స్, గేమ్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వై ఫై, బ్లూ టూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, యూఎస్‌బీ పోర్ట్, ఆడియో జాక్, ఎథెర్‌నెట్ పోర్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ టీవీలో ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -