Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ సంచలన నిర్ణయం.. కొత్త పార్టీ దిశగా అడుగులు?

Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, మాజీ ఎంపీ, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. ఈ సందర్భంగా సోనియాకు గులాం నబీ ఆజాద్ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాశనమైపోయిందన్నారు. రాహుల్ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వమనని, రాజకీయ పరిపక్వత లేదన్నారు. పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ లేదంటూ ఆరోపించారు. దాదాపు 50 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నందుకు బాధగా ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రముఖ నేతగా గులాం నబీ ఆజాద్ కు మంచి పేరుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయనకు అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఆయన.. కేంద్రమంత్రిగా కూడా సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా కూడా పనిచేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి రాజ్యసభకు ఎంపిక చేయకపోవడం, పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

గత రెండేళ్లుగా రాహుల్, గులాం నబీ ఆజాద్ మధ్య విబేధాలు నడుస్తున్నాయి. జీ-23 నేతల్లో కీలక నేతగా గులాంనబీ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల తరముకొస్తున్న నేపథ్యంలో ప్రచార కమిటీ చైర్మన్ గా ఆయనను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. కానీ ఆ పదవికి కొద్దిరోజుల్లో ఆయన రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్ తో పాటు పలువురి నేతల పేర్లు వినిపించాయి. కానీ అత్యంత సీనియర్ నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ పేరును మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మనస్తాపంతో ఆజాద్ రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ తదుపరి స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఆయన స్పందించారు. తాను ఏ పార్టీలో చేరనని, త్వరలో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్ లో కొత్త ప్రాంతీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లోని స్థానిక నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని, జాతీయ రాజకీయాల్లో కూడా తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బీజేపీలో చేరే ఆలోచన లేదన్నారు.

కానీ జమ్మూకశ్మీర్ లో బీజేపీకి అనుకూలించేలా గులాం నబీ ఆజాద్ రాజకీయాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. జమ్మూకశ్మీర్ లో బీజేపీతో కలిసి గులాంనబీ ఆజాద్ అధికారాన్ని పంచుకునేలా ప్లాన్ ఉంటుందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఆజాద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో బీజేపీకి అనుకూలించేలా ఆయన రాజకీయాలు ఉంటాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -