Ginna Movie Review: జిన్నా సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేదీ : అక్టోబర్21, 2022

నటీనటులు : విష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోనీ, నరేష్, సురేష్, అన్నపూర్ణ, సద్దాం, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, రఘుబాబు, సునీల్

నిర్మాణ సంస్థ: అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ

నిర్మాత : మంచు విష్ణు

దర్శకత్వం : సూర్య

సంగీతం : అనూప్ రూబెన్స్

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్

సినిమాటోగ్రాఫర్ : ఛోటా కే నాయుడు

Ginna Movie Review and Rating

మంచు విష్ణు సినిమా హిట్ అయి చాలా కాలమే అయింది. వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్ అనిపించుకునే సినిమా మంచు విష్ణుకు ఇప్పట్లో తగల్లేదు. కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో బాగా పేరు తెచ్చుకున్న మంచు విష్ణు మరోసారి హిట్ అందుకుంటాడా అనే అంచనాల నడుము జిన్నా సినిమా విడుదలైంది. దీపావళి కానుకగా 21 అక్టోబర్ 2022 రోజు జిన్నా సినిమా విడుదలైంది.

జిన్నా సినిమా కథ విషయానికి వస్తే గాలి నాగేశ్వర్ రావు అలియాస్ జిన్నా తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక టెంట్ హౌజ్ బిజినెస్ ప్రారంభిస్తాడు. అయితే ఆ బిజినెస్ పెట్టడానికి అతను అప్పు తెచ్చుకొని ఉంటాడు. కానీ ఆ టెంట్ హౌజ్ బిజినెస్ పెద్దగా వర్కవుట్ అవదు. దాంతో జిన్నాకు అప్పుల బాధ ఎక్కువవుతుంది. ఓ గుండా నుండి తెచ్చుకున్న అప్పు వల్ల జిన్నా కనిపించకుండా తిరుగుతుంటాడు.

ఆ గుండా జిన్నాను పట్టుకుని ఒక ఆఫర్ ఇస్తాడు. తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని ఆఫర్ ఇస్తాడు. దాంతో అతడు ఆ గుండా ఇంటిలోనే ఉంటాడు. ఆ తర్వాత అమెరికా నుండి జిన్నా స్నేహితురాలు రేణుక (సన్నీ లియోన్) వస్తుంది. ఆమె వల్ల జిన్నా కొద్దికొద్దిగా తన అప్పుల నుండి బయట పడుతుంటాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన పచ్చళ్ల స్వాతి (పాయల్ రాజ్ పుత్)ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆ గుండా అతడిని ఆపుతాడా? అనేది సినిమా కథ.

విశ్లేషణ: కామెడీ మరియు యాక్షన్ కలగలిపిన సీన్లు చేయడంలో మంచు విష్ణు పండిపోయినట్లు కనిపిస్తోంది. సినిమాలో కామెడీ సీన్లలో మంచు విష్ణు అదరగొట్టగా.. అదే రేంజ్ లో యాక్షన్ల సీన్లలో కూడా సత్తా చాటాడు. జిన్నాగా మంచు విష్ణు తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడనే చెప్పుకోవాలి. సినిమాలో మొత్తంలో మంచు విష్ణు ఫుల్ ఎనర్జీతో కనిపిస్తూ ప్రేక్షకులకు పాత విష్ణు వచ్చేశాడనే ఫీలింగ్ తెచ్చాడు.

ఇక సినిమాలో స్వాతి క్యారెక్టర్ చేసిన పాయల్ రాజ్ పుత్ చెప్పుకునేంత క్యారెక్టర్ చేయకపోయినా తన గ్లామర్ తో ఓకే అనిపించింది. ఈ సినిమాలో జిన్నా ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చే సన్నీ లియోన్ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయం. ఫస్టాఫ్ లో సన్నీ లియోన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండగా, సెకండాఫ్ లో మాత్రం తేలిపోయింది.

ఇక మిగిలిన నటులైన నరేశ్, రఘుబాబు, సురేష్, సునీల్, సత్యం రాజేశ్, గౌతం రాజు, చమ్మక్ చంద్ర, వెన్నెల కిశోర్, భద్రం తదితరులు తమతమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. బిగ్ బాస్ ఫేం దివి గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వగా పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమా పాటలు, బీజీఎం ప్రేక్షకులను ఆకట్టుకోగా.. అనూప్ రూబెన్స్ న్యాయం చేశాడనిపిస్తుంది. ఇక ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే అనిపించింది.

ప్లస్ పాయింట్స్ :

మంచు విష్ణు కామెడీ టైమింగ్, హీరోయిన్ల గ్లామర్, బాగా పండిన కామెడీ సీన్లు

ఫస్టాఫ్

పాటలు, బీజీఎం

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్క్రీన్ ప్లే

నెమ్మదిగా, ఊహించే కథనం

రేటింగ్ 2.5/5

బాటమ్ లైన్ : ఒకసారి చూడొచ్చు

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -