Ginna: మా అధ్యక్షుడికే తప్పని తిప్పలు.. థియేటర్లు కూడా దొరకట్లేవట!

Ginna: మా అధ్యక్షుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘జిన్నా’. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోనే ఇషాన్ సూర్య దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు జీ.నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకు స్టోరీని అందించగా.. రచయిత కోనా వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. పాయల్ రాజ్‌పుత్, సన్నిలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రయోషన్లలో జోరు పెంచింది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో థియేటర్లలో ఓపెన్సింగ్ అదిరిపోతాయని మేకర్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే జిన్నా మూవీకి సంబంధించి టీజర్, ట్రైలర్ విడుదల అయ్యాయి. వీటిని చూస్తే పక్కా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్లాపుల్లో కొనసాగుతున్న హీరో విష్ణు ఈ సినిమాతో హిట్ కొట్టేలా కనిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్‌కు ముందే జిన్నాకు కష్టాలు మొదలైనట్లు కనిపిస్తోంది. సినిమా రిలీజ్ చేయడానికి థియేటర్లు దొరకడం లేదని చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేసింది. జిన్నా రిలీజ్‌కు థియేటర్లు ఎందుకు దొరకట్లేదనే విషయంపై సినీ వర్గంలో పెద్ద చర్చ జరుగుతోంది.

అయితే ఈ దీపావళికే చాలా వరకు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓరి దేవుడా, సర్దార్, ప్రిన్స్ చిత్రాలు దీపావళి కానుకగా విడుదల కానున్నాయి. అలాగే ప్రస్తుతం కన్నడ సెన్సేషనల్ మూవీ ‘కాంతార’ తెలుగులో భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యులు కాంతార సినిమాను కొనసాగించేందుకు సుముఖత చూపిస్తున్నారు. ఈ క్రమంలో విష్ణు నటించిన జిన్నా సినిమాకు బ్రేకులు పడేలా కనిపిస్తున్నాయి. థియేటర్లు దొరకకపోవడంతో జిన్నాతో హిట్ కొట్టాలని అనుకుంటున్న విష్ణుకు చుక్కెదురైందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -