Girls Rejecting: అలాంటి అబ్బాయిలను రిజెక్ట్ చేస్తున్న అమ్మాయిలు.. ఏం జరిగిందంటే?

Girls Rejecting: కాలం మారిపోవడంతో ప్రజల ఆలోచన విధానం జీవనశైలి అన్ని మారిపోయాయి. పెళ్లి విషయంలో కూడా సామాజిక పరిస్థితులు మారిపోయాయి. క్రమంగా ఒక్కొక్కటిగా మారుతూ వస్తూనే ఉన్నాయి. భారతదేశంలో పెళ్లిళ్ల విషయంలో అయితే పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయి. ఇదివరకటి రోజుల్లో పెళ్ళికొడుకు మంచి లక్షణాలు ఉన్నవాడు పనిమంతుడు అయితే చాలు అని అనుకునేవారు. కానీ రాను రాను ఆలోచన విధానం మారడంతో ఉద్యోగం ఉండాలి డబ్బు ఉండాలి మంచి గుణాలు ఉండాలి ఇలా అన్ని విషయాలను అంచనా వేస్తున్నారు.

ఎక్కువ శాతం ఆస్తులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆర్థికంగా నిల‌దొక్కుకున్న కుటుంబం నుంచి వ‌చ్చిన అమ్మాయిల ఆలోచ‌న ధోర‌ణి మ‌రీ అతిగా ఉంటోంది. పెళ్లి ప్ర‌పోజ‌ల్ రాగానే నూరేళ్ల జీవితం గురించి ఆలోచించేస్తూ ఉన్నారు అమ్మాయి. అబ్బాయి ఏం చ‌దువుకున్నాడు?ఏం జాబ్ చేస్తున్నాడు?ఎక్క‌డ జాబ్ చేస్తున్నాడు? ఫారెన్ వెళ్లే ఛాన్సులు ఎంత వ‌ర‌కూ ఉన్నాయి?అత‌డికి అక్క‌చెల్లెళ్లు ఉన్నారా?అన్నాద‌మ్ముళ్లు ఉన్నారా?వాళ్లు జాబ్ చేస్తున్నారా! ఇలా సవా లక్ష ప్రశ్నలు వేస్తున్నారు. అంతే కాకుండా పెళ్లికి ముందే వాటాలు పెట్టుకుంటే ఒక్కోరికి ఎంత ఆస్తిపాస్తులు ద‌క్కుతాయి అన్న విషయాల గురించి కూడా చర్చించుకుంటున్నారు.

 

త‌మ ఇంటికి కోడ‌లు రావాల‌న్నా ఇలాంటి ఆరాలు తీస్తార‌నే నిష్టూర‌మైన నిజాన్ని అమ్మాయిల త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేరు. కేవలం అబ్బాయిలు మాత్రమే కాకుండా అమ్మాయిల తరపున ఆలోచన విధానం కూడా ఇలాగే ఉంది. త‌మ కూతురును ఇస్తున్నామంటే మాత్రం.. ఇలాంటి లెక్క‌ల‌న్నీ వేస్తున్నారు. అబ్బాయి త‌మ్ముడికో అన్న‌కో జాబ్ లేద‌నే విష‌యం తెలిసినా వీళ్లు ఆలోచ‌న‌లో ప‌డిపోతున్నారు! ఇలాంటి త‌ట‌ప‌టాయింపుల‌కు హ‌ద్దు లేకుండాపోతోంది. ఈ మధ్యకాలంలో డబ్బు ఆస్తి అన్ని ఉన్నా కూడా అబ్బాయిలకు పెళ్లి కావడం అనేది కష్టంగా ఉంది. ఆస్తుల గురించి వారు చదువుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టి చివరికి పెళ్లి పెటాకులు అవుతున్నాయి. పది పెళ్లి సంబంధాలలో కేవలం రెండు మూడు సంబంధాలు మాత్రమే ఓకే అవుతున్నాయి. దానికి తోడు ఇండియాలో ప్రతి పదిమంది మగవారికి ఆరు మంది స్త్రీలు ఉండడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -