Chandrababu Naidu: దేవుడా.. చంద్రబాబు మాటలు అస్సలు నమ్మేలా లేవుగా!

Chandrababu Naidu: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో చంద్రబాబు ప్రమోషన్స్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయబడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహానాడు కార్యక్రమంలో ఎన్నికలకి ఇంకా సమయం ఉండగానే మేనిఫెస్టోని విడుదల చేసిన విషయం తెలిసిందే.. మేనిఫెస్టో పై అనేక రకాల వార్తలు వినిపించాయి. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా మరోసారి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌లోనే సన్ రైజ్ ఏపీగా మారుస్తాన‌ని బాబు అన్నారు.

ఏపీ రాజ‌ధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల భూసేకరణ చేశామని, 3 రాజధానులు పేరుతో ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌ అమరావతిని నాశనం చేశారని దుయ్యబట్టారు. జూన్ 2 ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రోజని, గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది అని తెలిపారు బాబు. నవనిర్మాణ దీక్షతో ప్రజల్లో ఒక చైత్యన్యం తెచ్చామని బాబు గుర్తు చేశారు. పోలవరం ద్వారా నదుల అనుసంధానంతో ఏపీని సస్యశ్యామలం చేయాలనుకున్నామని చంద్ర‌బాబు తెలిపారు. నవ్యాంధ్ర కోసం 2029 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

 

మధ్యలో రాజధాని పెట్టామని, రాజధాని కంటిన్యూ అయి ఉంటేఇప్పటికే రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చి ఉండేదని తెలిపారు. నీతి ఆయోగ్ సూచనల మేరకే పోలవరం నిర్మాణం ఏపీకి అప్పజెప్పారని చంద్ర‌బాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశాక పోలవరాన్ని జగన్ రివర్స్ చేశారని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ హయాంలో రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్న చంద్ర‌బాబు ఇప్పుడు ఏపీలో ఎఫ్‌డీఐలు అథ‌మ స్థానంలో ఉన్నాయని అన్నారు. ఏపీని ఐటీ హబ్ చేయాలనుకుంటే గంజాయి హబ్‌గా మార్చారని దుయ్య‌బ‌ట్టారు. విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి యూనివర్శిటీలు తెచ్చామ‌న్నారు. విజయనగరంలో గిరిజన వర్శిటీకి భూమిస్తే వైసీపీ ప్రభుత్వం ఆపేసిందన్నారు. అమరావతి,అనంతపూర్ ఎక్స్ప్రెస్ వేయాలని భావిస్తే.. అమరావతి,ఇడుపులపాయకు ఆ రోడ్డు మార్చారని, వాళ్ల వ్యాపారాల కోసమే వైసీపీకి సీట్లు ఇచ్చినట్లు అయిందని చంద్రబాబు విమర్శించారు. బాబు చేసిన వాక్యాలపై స్పందించిన అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు బాబు చేస్తున్న వాఖ్యలు నమ్మేలా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న...
- Advertisement -
- Advertisement -