GodFather: నైజాంలో గాడ్ ఫాదర్ కు నష్టాలు తప్పవా?

GodFather: మెగాస్టార్ చిరంజీవి నటించినగాడ్ ఫాదర్ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ అద్భుతమైన హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికీ 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.ఇకపోతే అన్ని ఏరియాలలో లాభాలు పొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో మాత్రం నష్టాలను ఎదుర్కొంటుందని తెలుస్తోంది.

నైజాం ఏరియాలో ఈ సినిమా 22 కోట్లకు బిజినెస్ జరుపుకుందని సమాచారం.అయితే నైజాం ఏరియాలో ఈ సినిమాకు సరైన థియేటర్లు దొరకపోవడం వల్ల పెద్దగా కలెక్షన్లను రాబట్ట లేకపోయిందని తద్వారా ఈ సినిమా ఆరేడు కోట్ల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాలీవుడ్ సమాచారం. సాధారణంగా నైజాం హక్కులను ఎక్కువగా దిల్ రాజు కొనుగోలు చేస్తారు.

గాడ్ ఫాదర్ సినిమా నైజాం హక్కులను ఏసియన్ సునీల్ కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు నైజాం హక్కులు తనకు లేకపోవడంతో గాడ్ ఫాదర్ సినిమాకు సరైన థియేటర్లో కేటాయించలేదని తెలుస్తుంది.ఇలా ఈ సినిమా మంచి థియేటర్లలో రన్ కాకపోవటం వల్ల నైజాం ఏరియాలో ఈ సినిమా నష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఈ విధంగా దిల్ రాజుకు నైజాం ఏరియా హక్కులు లేకపోవడం వల్ల అతని కారణంగానే గాడ్ ఫాదర్ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయని సమాచారం.

నైజాం హక్కులను దాదాపు 22 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 15 కోట్లు వరకే రాబట్టింది.దీన్ని బట్టి చూస్తే నైజాం ఏరియాలో గాడ్ ఫాదర్ సినిమాకి నష్టాలే మిగులుతాయని భావిస్తున్నారు.ఇకపోతే మిగిలిన అన్ని ప్రాంతాలలో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది.ఈ సినిమా విడుదలైన వారానికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందుకుంటుంది. ఇక యూఎస్ఏ లో కూడా కేవలం ఐదు రోజులకే వన్ మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.

Related Articles

ట్రేండింగ్

Vanga Geetha: వైసీపీ వంగా గీతకు ప్రజల్లో తిరస్కారం వెనుక అసలు లెక్కలివేనా.. ఏం జరిగిందంటే?

Vanga Geetha: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అందరూ చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కాపు...
- Advertisement -
- Advertisement -