God Father Collections: గాడ్ ఫాదర్ ఆరు రోజుల కలెక్షన్లు అంత తక్కువా.. మొత్తం ఎంతంటే?

God Father Collections: మోహన్ రాజ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా విజయదశమి సందర్భంగా విడుదలైంది. దసరా పండుగ రోజు విడుదలైన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా విడుదలయ్యి వారం రోజులు కావడంతో ఈ సినిమా కలెక్షన్ల గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ సినిమా విడుదలైన ఆరు రోజులకు ఏ ఏ ప్రాంతంలో ఎంత మేర కలెక్షన్లను రాబట్టిందనే విషయానికి వస్తే… నైజాం 11.37 కోట్లు, సీడెడ్ ఏరియా 8.71 కోట్లు, ఉత్తరాంధ్ర 5.16 కోట్లు, ఈస్ట్ 3.35 కోట్లు, వెస్ట్ 1.98 కోట్లు, గుంటూరు 3.66 కోట్లు, నెల్లూరు 1. 84 కోట్లు, కృష్ణ 2.40 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ విధంగా తెలంగాణ ఏపీ మొత్తం కలిపి ఆరు రోజులకు గాను గాడ్ ఫాదర్ సినిమా 38.47 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఇతర భాషలలో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్ల విషయానికి వస్తే కర్ణాటకలో ఆరు రోజులకు గాను 4.40 కోట్ల వసూలు రాబట్టింది. హిందీలో 4.40, ఓవర్సీస్ 4.50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. వారం రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి 51.77 కోట్ల షేర్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.అయితే ఇలా ఆరు రోజులకు గాను 51.77 కోట్ల షేర్స్ అంటే చిరంజీవి సినిమా విషయంలో తక్కువనే అని ట్రేడ్ వర్గాల నిపుణులు చెబుతున్నారు.

ఇక మలయాళంలో ఎంతో అద్భుతమైన హిట్ అందుకున్న ఈ సినిమాని కొన్ని మార్పులు చేసి తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాలో నయనతార చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించారు. ఇక సత్యదేవ్ సల్మాన్ ఖాన్ వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో సందడి చేశారు.వారం రోజులకు గాను 51 కోట్ల షేర్స్ రాబట్టగా వచ్చే రెండు వారాలలోను ఏ విధమైనటువంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా మరింత కలెక్షన్లను రాబట్టే సూచనలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -