God Father Movie Review: గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేదీ : అక్టోబర్5, 2022

నటీనటులు : చిరంజీవి, నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్

నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్

నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి, రామ్ చరణ్

దర్శకత్వం : మోహన్ రాజా

సంగీతం : ఎస్. థమన్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

సినిమాటోగ్రాఫర్ : నీరవ్ షా

God Father Movie Review and Rating 

దసరా పండుగ కానుకగా ఈ వారం థియేటర్లలో విడుదలైన సినిమాలలో గాడ్ ఫాదర్ సినిమాపైనే అంచనాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. లూసిఫర్ సినిమా రీమేక్ అయినప్పటికీ చిరంజీవి నటించిన సినిమా కావడం, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ఈ సినిమాలోని డైలాగ్స్ చిరంజీవి నిజ జీవితానికి దగ్గరగా ఉండటం కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

గాడ్ ఫాదర్ సినిమా కథ సీఎం పీకేఆర్ మరణంతో మొదలు కాగా పీకేఆర్ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సామాన్య ప్రజల్లో జరుగుతుంది. సీఎం కావాలని ఎక్కువమంది ఆశ పడటంతో ఆ పదవి కోసం ఎవరి ప్రయత్నాలను వాళ్లు మొదలుపెడతారు. అదే సమయంలో బ్రహ్మ( మెగాస్టార్ చిరంజీవి) ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో మార్పుకు కారణమవుతారు.

అయితే పీకేఆర్ అల్లుడు(సత్యదేవ్) కూడా తన బలాన్ని పెంచుకోవడంతో పాటు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ప్రయత్నం చేస్తారు. పైకి మంచిగా కనిపించే పీకేఆర్ అల్లుడు నిజస్వరూపం ఏమిటి? పీకేఆర్ కు బ్రహ్మకు మధ్య సంబంధం ఏమిటి? పీకేఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరు? సత్యదేవ్ కు చెక్ పెట్టడానికి బ్రహ్మ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ.

విశ్లేషణ: నటుడిగా చిరంజీవి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో నటించినా చిరంజీవి తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారు. ఆరు పదుల వయస్సులో కూడా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. సత్యదేవ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పోషించారు. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవికి ధీటుగా సత్యదేవ్ నటన ఆకట్టుకుంది. సముద్రఖని, నయనతార, సల్మాన్ ఖాన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

థమన్ బీజీఎం బాగానే ఉన్నా సాంగ్స్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది. చిరంజీవిని కొత్తగా చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. మెగా అభిమానులకు ఈ సినిమా విందు భోజనంలా ఉంటుంది. ఇంద్ర, ఠాగూర్ సినిమాల రేంజ్ లో ఈ సినిమా మెగా అభిమానులకు నచ్చుతుంది. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు తన వంతు న్యాయం చేశారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు.

లూసిఫర్ కంటే బెటర్ గా ఉన్న గాడ్ ఫాదర్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. మోహన్ రాజా చేసిన మార్పులు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్ :

చిరంజీవి, సత్యదేవ్ యాక్టింగ్

ఫస్టాఫ్

నిర్మాణ విలువలు

బీజీఎం

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్

క్లైమాక్స్

మ్యూజిక్

రేటింగ్ 3/5

బాటమ్ లైన్ : చిరంజీవి అభిమానులను మెప్పించే “గాడ్ ఫాదర్”

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -