Simhadri Day 1 Collections: దేవుడా.. సింహాద్రి డే1 కలెక్షన్లు ఏకంగా ఆ రేంజ్ లో ఉన్నాయా?

Simhadri Day 1 Collections: తాజాగా పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 20 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఇలా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. కానీ అవన్నీ ఒక ఎత్తు వచ్చేసి సింహాద్రి సినిమా మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇండియా వ్యాప్తంగా అత్యధిక షోలు ప్లాన్ చేశారు. అలాగే ఆస్ట్రేలియా యూకే యూఎస్,కెనెడా,జపాన్,మలేషియాలలో కూడా ఈ సినిమాను రీ రిలీజ్ చేసుకున్నారు.

ఎన్టీఆర్ సింహాద్రి చిత్రం రీ రిలీజ్ అయిన మొదటి రోజు నందమూరి అభిమానుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. దాంతో ఈ చిత్రం అత్యధిక వసూళ్లను రాబట్టినట్లు నందమూరి ఫ్యాన్స్ ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు. అందులో ఫస్ట్ డే ఏపీ తెలంగాణలో కలిపి రూ. 4.95 కోట్లు గ్రాస్ను రాబట్టినట్లు చెప్పారు. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు ఓవర్ సీస్ లో రూ. 67 లక్షలు వసూలు చేసిందట. రీ రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోనూ సత్తా చాటుకున్న సింహాద్రి మూవీ మొదటి రోజు ఏకంగా రూ. 6.02 కోట్లు గ్రాస్ ను వసూలు చేసినట్లు ఫ్యాన్స్ అధికారికంగా వెల్లడించారు.

 

నిజంగానే రియల్ శకంలో ఇది సరికొత్త రికార్డ్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన ఏ సినిమాలు కూడా ఈ స్థాయిలో బడ్జెట్ ను రాబట్టలేదు. ఇప్పటికే దారి ఒంట్లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు,రామ్ చరణ్ లు నటించిన సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -