Godfather: గాడ్ ఫాదర్ రిజల్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్!

Godfather: టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరో ఎవరని అడిగితే అందరూ కామన్ గా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని, సపోర్ట్ లేని స్థాయి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిన చిరంజీవి.. తన సెకండ్ ఇన్సింగ్స్ ని ఓ మోస్తరుగా రన్ చేస్తున్నాడు. అనుకున్న స్థాయిలో చిరంజీవి సినిమాలు ఆడటం లేదు.

ఆ మధ్యన రాజకీయాల నేపథ్యంలో కాస్త బ్రేక్ తీసుకున్న చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఖైదీ నెంబర్ 150 తర్వాత నుండి చిరంజీవికి తగ్గ సినిమాలు ఏవీ రావట్లేదు. పైగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం లేదు. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా కూడా ఇలాంటి నిరుత్సాహాన్ని నింపింది.

మలయాళంలో వచ్చిన ‘లూసీఫర్’ సినిమాకు రీమేక్ గా తెలుగులో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలో విడుదలవగా.. అక్కడ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. దీనిపై స్పందించిన నిర్మాత రామ్ చరణ్.. ఓటీటీలో సినిమాపై, రీమేక్ లు తీయడంపై జాతీయ మీడియాతో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

రీమేక్ సినిమాల జోలికి వెళితే ముందు దాని ఒరిజినల్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండకుండా చూసుకోవాలని రామ్ చరణ్ అన్నాడు. గాడ్ ఫాదర్ కు కూడా అదే మైనస్ అయిందని అన్నాడు. ఓటీటీలో ఇప్పటికే ఒరిజినల్ సినిమా ‘లూసీఫర్’ తెలుగులో అందుబాటులో ఉండటంతో చాలామంది దీనిని తెలుగులో చూడటానికి ఆసక్తి చూపించడం లేదని అన్నాడు. స్టార్లతో సంబంధం లేకుండా కొన్నిసార్లు ఫలితాలు ఉంటాయని రామ్ చరణ్ తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -