బ్యాంకులు ఇచ్చిన ఆఫర్లతో బంగారం, కార్లు కొనేందుకు పరుగులు!

పండుగలు వస్తున్నాయంటే వస్తువులైనా.. వాహనాౖపైన అయినా ఆఫర్ల ప్రకటిస్తుంటారు. చాలా మంది ఏమన కొనాలనుకున్నా కూడా పండగలు వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. ప్రతి ఒక్కరూ నూతన వస్తువులను కొనేందుకు ఆసక్తి కనబరుస్తారు. మరికొందరైతే దీర్ఘ కాలిక పెట్టుబడి పెట్టి సొంతింటి కొనుగోలుకు మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడంతా డిజిటల్‌ కావడంతో ప్రతి వస్తువులు ఈ–కామర్స్‌లో లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ –కామర్స్‌ సంస్థల్లో వస్తువుల కొనుగోళ్లు, మొబైల్‌ ఫోన్లు, ఆటోమొబైల్స్‌ అనగా కార్లు, బైక్‌లు కొనుగోళ్లు సొంతింటి కలన నిజం చేసుకునేవారికి బ్యాంకులు అద్భుతమైన ఆఫర్లు, భారీ ఇవ్వనుంది. త్వరలో దీపావళి క్రిస్మస్, నూతన సంవత్సరం ఆ తర్వాత సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు రానున్న నేపథ్యంలో బ్యాంకులు మంచి రాయితీలు ఇస్తున్నాయి.

ఎస్బీఐ బ్యాంక్, కారు,్ల బంగారం కొనుగోలు చేసేవారికి ప్రత్యేక ఆఫర్లు ఇస్తోంది. వారికి పర్సనల్‌ లోన్లపై ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ చేసింది. దీనిని యోనో యాప్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు. మరింత వివరాల కోసం ఎస్బీఐ వైబ్‌సైట్లు, లేదా సమీపంలోని బ్రాంచీకి వెళ్లి వివరాలు తీసుకోవాలంటూ బ్యాంక్‌ ట్వీట్‌ చేసింది. అంతే కాక ఎస్బీఐ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుతో ఈ–కామర్స్‌ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లో మొబైల్‌ ఫోన్లు, తదితర వస్తువుల కొనుగోళ్లు చేసే వారికి అదనపు డిస్కౌంట్లు కూడా అందిస్తోంది.

సంప్రదాయ దస్తుల కొనుగోళ్లపై 5–10 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా ఇవ్వనుంది. ఎస్బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఆభరణాలు కొనుగోలు చేస్తే రూ.2,500 నుంచి రూ.5000 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఉన్నట్లు వెల్లడించింది. ప్రత్యేకించి హీరో మోటో కార్ప్‌ నుంచి 9 నెలలతో వెహికల్‌ లోన్‌ తీసుకుంటే ఐదు శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ లభిస్తుంది. ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ కొనుగోళ్లపై 22.5 శాతం, 15 శాతం, 12 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉంది.

ఇక ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు వాడే వారికి ఈ–కామర్స్‌ సంస్థల్లో ఆన్‌లైన్‌ వేదికగా జరిసే కొనుగోళ్లపై 10 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. మొబైల్‌ ఫోన్లు, లగ్జరీ గూడ్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులకు ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. అదనంగా పెస్టివ్‌ బొనంజా కింద ల్యాంక్‌ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, కార్డ్‌ లెస్‌ ఈఎంఐలపై రూ.25 వేల వరకు డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు కూడా ఇవ్వనుంది.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -