TTD: టీటీడీ డయల్‌ యువర్‌ ఈఓలో వచ్చిన ఫిర్యాదులెంటో తెలుసా?

TTD: తిరుమల పేరు వినగానే గుర్తొచ్చేది లడ్డూ. అక్కడ లభించే లడ్డూ మరెక్కడా దొరకదు. అందుకే టీటీడీ వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో లడ్డూలను ఎక్కువగా తీసుకొస్తుంటారు. లడ్డూతో పాటు అక్కడ అందించే అన్న ప్రసాదాలను నాణ్యతతో కూడినవి అందించేందుకు నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారు. భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదాలను అందజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భాగంగా ఫోన్లు చేసిన భక్తులు కూడా అన్న ప్రసాదానికి సంబంధించే ఎక్కువగా ఫిర్యాదులు చేశారు.

ఇప్పటివరకు తాము శుచిగా, రుచిగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నామని, బియ్యంలో నాణ్యత పెంచేందుకు తప్పనిసరిగా మిల్లర్లతో మాట్లాడతామని ఈవో విశాఖపట్టణం నుంచి ఫోన్‌ చేసిన వెంకటరమణకు హామీ ఇచ్చారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో ప్రసాదాలు తీసుకోవడానికి గంటన్నర సమయం పడుతోందని, అన్ని కౌంటర్లు పనిచేసేలా చూడాలని బెంగళూరుకు చెందిన వెంకటేష్‌ కోరారు. అలాగే కొండపై శ్రీవారి బంగారు డాలర్లు 10 గ్రాములు, రెండు గ్రాములు మాత్రమే ఉన్నాయని, ఈ దర్శన్‌ కౌంటర్లు తిరిగి ప్రారంభించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లు పొందిన వారికి అదే రోజు గదులు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని వరంగల్‌ కు చెందిన మురళీధర్, హైదరాబాద్‌ కు చెందిన సీత కోరారు. క్యూలైన్‌లో దళారులు అధిక ధరలకు గదులు విక్రయిస్తున్నారని ఈవోకు ఫిర్యాదు చేశారు.

కొండపై హోటళ్లలో టిఫిన్‌ ధరలు తగ్గించాలని సత్యవేడుకు చెందిన అనీల్‌ రెడ్డి కోరారు. శ్రీవారి సేవకు ఒక్కొక్కరి వద్ద రూ.400 వసూలు చేస్తున్నారని కరీంనగర్‌కు చెందిన మహేందర్రావు ఆరోపించారు. ఆన్‌లైన్‌లో నేరుగా బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించామని, స్వామివారికి సేవ చేసుకునేందుకు దళారులకు సేవకులు డబ్బులివ్వకూడదని ఈవో సమాధానం ఇచ్చారు. సేవ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వీఐపీ దర్శనాలు రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని, వీఐపీ దర్శనాలవల్ల సాధారణ భక్తుల దర్శనం ఆలస్యమవుతోందని, సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని మడకశిరకు చెందిన రామకృష్ణ చెప్పారు. దేవస్థానం కమిటీతో చర్చించి ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలిస్తామని ఈఓ హామీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -