iPhone: యాపిల్ లవర్స్ కి గుడ్ న్యూస్.. రూ.20 వేల లోపే ఐఫోన్?

iPhone: దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ప్రేమికులు జీవితంలో ఒక్కసారైనా గానీ ఐఫోన్ ని ఉపయోగించాలని కోరుతూ ఉంటారు. కానీ దాని ధర విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటారు. దీంతో చాలామంది ఆ కోరికను సెకండ్ హ్యాండ్ ఫోన్ ల రూపంలో తీర్చుకుంటూ ఉంటారు. అయితే అటువంటి వారికి తాజాగా ఫ్లిప్కార్ట్ సంస్థ ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఐఫోన్‌ 12 మినీని రూ. 20 వేలలోపు కొనుగోలు చేసే ఆకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఐఫోన్ 20 లోపే లభించడమేంటా అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే..

ప్రస్తుతం ఐఫోన్‌ 12 మినీ ప్రారంభ ధర రూ. 59,900గా ఉంది. అయితే ఫ్లిప్‌ కార్ట్ సంస్థ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌ తో కేవలం రూ. 38,499కి అందిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకుల కార్డుల పై భారీగా ఆఫర్‌ లభిస్తోంది. కోటక్‌ బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ రూ. 37,499కి లభిస్తోంది. అంతే కాదండోయ్ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ ద్వారా కూడా క్యాష్‌ బ్యాక్‌ లభిస్తోంది. కంపెనీ కండిషన్స్‌ను అనుగుణంగా ఉంటే పాత ఫోన్‌ పై దాదాపుగా రూ. 17,500 తగ్గింపు లభిస్తుంది. అలా ఐఫోన్ రూ. 19,999కి సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఐఫోన్‌ 12 మినీ ఫీచర్ ల విషయానీకి వస్తే.. ఇందులో 5.4 ఇంచెస్‌ డిస్‌ప్లే స్క్రీన్‌ను అందించారు.

ఇది ఆండ్రాయిడ్‌ 14.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ ఓఎస్‌ను ఐఓఎస్‌ 16.2కి అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను 64 జీబీ స్టోరేజ్‌ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ 4జీబీ ర్యామ్‌తో లభిస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో ఎల్‌ఐ ఐయాన్‌ 2227 ఎమ్‌ఏహెచ్‌ నాన్‌ రీమువబుల్‌ బ్యాటరీని అందించారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -