Modi Sarkar: మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. రైతులకు పండగేనా?

Modi Sarkar: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 సహాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రూ.2,000 చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.6,000 జమ అవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని రెట్టింపు చేస్తుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కనుక నిజం అయితే రైతుల ఖాతాల్లోకి ప్రతీ విడతలో రూ.2,000 బదులు రూ.4,000 జమ అవుతాయి.

 

కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే ప్రతీ ఏటా రైతుల ఖాతాలో రూ.12,000 పెట్టుబడి సాయం జమ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.6,000 నుంచి రూ.12,000 చేస్తుందని తాజాగా వస్తున్న వార్తలపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేయాలని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే దేశంలోని 12 కోట్ల మంది రైతులకు మేలు జరుగుతుంది. మరోవైపు రైతు సంఘాలు కూడా పీఎం కిసాన్ డబ్బుల్ని పెంచాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.

 

అయితే పీఎం కిసాన్ డబ్బుల్ని పెంచడంపై త్వరలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీఎం కిసాన్ కింద రైతులు 13 విడతల్లో లబ్ధి పొందారు. 14వ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. 2023 ఏప్రిల్ జూలై విడత డబ్బులు విడుదల కావాల్సి ఉంది. నెల రోజుల క్రితమే పీఎం కిసాన్ పథకం 13వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలైంది. 2022 డిసెంబర్ 2023 మార్చి విడతలో 8.53 కోట్ల రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయి. గతేడాది ఏప్రిల్ జూలై విడతలో 11.27 కోట్ల రైతులకు, ఆగస్ట్ నవంబర్ విడతలో 8.99 కోట్ల రైతులకు, 2022 డిసెంబర్ 2023 మార్చి విడతలో 8.53 కోట్ల రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -