World Cup: టీమిండియాకు గుడ్ న్యూస్.. వన్డే ప్రపంచకప్‌కు అందుబాటులోకి బూమ్రా

World Cup: వన్డే వరల్డ్ కప్ ముగింట టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా వన్డే వరల్డ్ కప్ లో ఆడనున్నాడు. గత కొంతకాలంగా గాయంతో బూమ్రా మ్యాచ్ లు ఆడటం లేదు. టీమిండియా మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ లోనూ ఆడటం లేదు. అయితే గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ కి కూడా దూరమవుతాడనే వార్తలొచ్చాయి. కానీ బూమ్రా కూడా వన్డే ప్రపంచకప్ నాటికి గాయం నుంచి కోలుకుంటాడని, అప్పటికి అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది.

బుమ్రాకు సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, త్వరలోనే వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకుంటాడని స్పష్టం చేసింది.ఇక శ్రేయస్ అయ్యర్ కి కూడా వచ్చేవారం సర్జరీ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ రెండు వారాల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటాని, తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్తాని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

 

అయితే బూమ్రాకు న్యూజిలాండ్‌లో సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకోగా.. ఆరు వారాల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉండనున్నాడు. దీంతో జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ మొదలుపెట్టనున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా సర్జరీ పూర్తైన తర్వాత అకాడమీకి వెళ్లి శిక్షణలో పాల్గొననున్నాడు. తీవ్ర వెన్నునొప్పి కారణంగా బూమ్రా ఆసియా కప్, టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లకు దూరం అయ్యాడు. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిక్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. వన్డే ప్రపంచకప్‌లో బూమ్రా ఆడనున్నాడనే సమాచారంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.దాదాపు ఏడాది కాలంగా బుమ్రా బౌలింగ్ ను ఫ్యాన్స్ చూడలేదు. ఎట్టకేలకు వన్డే ప్రపంచకప్ నాటికి జట్టులోకి రావడం శుభపరిణామంగా చెప్పవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -