Tollywood: స్టార్ హీరోల ఫ్యాన్స్ కు శుభవార్త.. సినిమాల రిలీజ్ ఎప్పుడంటే?

Tollywood: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో విడుదల అవుతున్న సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండగా మరికొన్ని సూపర్ హిట్ నిలుస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో విడుదలైన సినిమాలలో ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది మొదలై అప్పుడే మూడు నెలలు ముగిసింది. ఇక ఏప్రిల్ నెల నుంచి ఒక్కో నెల ఒక్కో సినిమాతో ప్రేక్షకులకు పలకరించడానికి పెద్దపెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

 

వచ్చేనెల ఏప్రిల్ లో పెద్ద సినిమా శాకుంతలం, ఏజెంట్, రావణాసుర లాంటి పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలలో ముందుగా రావణాసుర సినిమా విడుదల కానుండగా తర్వాత శాకుంతలం సినిమా విడుదల కానుంది. ఇక చివర్లో ఏజెంట్ సినిమా విడుదల కానుంది. మే నెలలో నాగచైతన్య నటిస్తున్న కష్టడీ సినిమా విడుదల కానుంది. నాగచైతన్య చేస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ఇది. ఆ తర్వాత జూన్ నెలలో ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతుంది.

ఇప్పటికే ఒకసారి వాయిదాపడిన ఈ సినిమా రిలీజ్ పై ఇంకా అనుమానాలున్నప్పటికీ, జూన్ లో ఎలా అయినా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. అలాగే జూలై నెలలో పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటించిన వినోదయ సీతం సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత ఆగస్టు నెలలో చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ లో అయితే రెండు పెద్ద సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. అందులో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఒకటిగా విజయ్ దేవరకొండ సమంత కలిసి నటించిన ఖుషి సినిమా ఒకటి.

 

ఆ తర్వాత అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తీస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా రాకపోయినా అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ నెల నుంచి ఒక్కో నెలలో ఒక్కో సినిమా విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న సినిమాలు అన్నీ కూడా భారీ సినిమాలే. వీటితో పాటుగా చిన్న చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. వాటితో పోల్చుకుంటే ఈ సినిమాలపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా సక్సెస్ అవుతుంది ఏ సినిమా ఫెయిల్ అవుతుంది అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -