Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. జాబ్ మేళాతో జాబ్ గ్యారంటీ!

Jobs: దేశవ్యాప్తంగా రోజురోజుకీ నిరుద్యోగుల సంఖ్య అందకంతకు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఎన్నో రకాల జాబ్స్ తీసుకొచ్చినప్పటికీ అందులో చాలా వరకు నిరుద్యోగులు క్వాలిఫై కాలేకపోతున్నారు. దీంతో చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం పై ఆశలు వదిలేసుకొని ప్రైవేట్ కంపెనీ ఆసక్తిని చూపిస్తున్నారు. తరచూ నిరుద్యోగుల కోసం గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ విడుదల అవుతూనే ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ నిరుద్యోగులకు శుభవార్త కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏప్రిల్ 2న ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 100 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్ విద్యార్హత కలిగిన వారు ఆయా ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

 

ఇకపోతే ఏ ఏ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి అన్న విషయానికి వస్తే.. ఆధార్ కార్డు విద్యార్హత సర్టిఫికేట్లు,ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు,
స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అలాగే 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకోవాలి. వీటన్నింని మూడు సెట్లు జిరాక్స్ కాపీలు చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2, 2023 ఉదయం 10.00-6.00 గా ఉంది.

 

ఇంటర్వ్యూ వేదిక: మెట్రో ట్రక్ పార్క్, వై-జంక్షన్, కూకట్ పల్లి.

రిజిస్ట్రేషన్ ఇలా: అభ్యర్థులు పైన అటాచ్ చేసిన ఫొటో లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు నిరుద్యోగులకు ఇంకా ఏవైనా హాలు ఉంటే వెంటనే ఇతర వివరాల కోసం 6301717425, 6301716125 నంబర్లను సంప్రదించాలి అని ఇలియాజ్ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -