Google Search: నవ వధువులు నెట్ అవి ఎక్కువగా చూస్తున్నారట..సర్వేలో షాకింగ్ నిజాలు

Google Search: ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడని వారంటూ ఎవ్వరూ ఉండరు. మొబైల్స్ వినియోగం, ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయాక ఇప్పుడు అందరూ క్షణం కూడా తీరిగ్గా ఉండటం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతున్నా నిమిషాల వ్యవధిలోనే తెలుసుకుంటున్నారు. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకున్నా వెంటనే గూగుల్ ను ఓపెన్ చేసి తెలుసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఏ విషయం గురించైనా గూగుల్ ద్వారా సమాచారాన్ని పొందుతున్నారు. అందుకే ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయిందని చెబుతుంటారు.

 

తాజాగా గూగుల్ సెర్చింగ్ సర్వే జరగ్గా ఆ సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. సర్వే ప్రకారం చూస్తే కొత్తగా పెళ్లయినటువంటి అమ్మాయిలు గూగుల్లో చాలానే వెతుకుతున్నారట. కొత్త వధువులు ఇంటర్నెట్ లో ఏం వెతుకుతున్నారో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే.

 

చాలామంది కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు గూగుల్లో తన భర్తని ఏ విధంగా ఆకట్టుకోవాలి, తన భర్త మాట వినాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారట. అంతేకాకుండా అత్తగారిని ఎలా కన్విన్స్ చేయాలనే విషయాలను తెలుసుకునేందుకు కూడా గూగుల్లో తెగ శోధిస్తున్నట్లు సర్వేలో తేలింది.

 

మరీ ముఖ్యంగా పిల్లలు పుట్టడానికి ఏ సమయంలో భార్యాభర్తలు కలవాలనే విషయాన్ని కూడా గూగుల్ సర్చ్ లో వెతికి తెలుసుకోవాలనుకుంటున్నారట. గూగుల్ సర్వేలో ఈ విషయాలు తేలాయి. ఈ సర్వేకు చాలా మంది అవాక్కవుతున్నారు. ఏదేమైనా ప్రతి చిన్న విషయాన్ని ఇలా గూగుల్ లో వెతకడం ఏంటని కొందరు అభిప్రాయపడుతున్నారు. మనసుకు సంబంధించిన విషయాలు కూడా ఇలా గూగుల్ సెర్చ్ చేయడం ఏంటని, వాటి వల్ల జ్ఞాపకశక్తి అనేది కూడా బాగా తగ్గుతుందని ఇంకొంత మంది నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -