Kerala: కొడుకుతో పాటు తల్లికి ఉద్యోగం.. ఆ కుటుంబంలో ఆనందం

Kerala: తల్లీకొడుకు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్ష రాశారు. ఒకేసారి ఇద్దరు పరీక్ష రాయగా.. ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది. దీంతో తల్లీకుమారుడు ఆనందంలో మునిగితేలుతున్నారు. కేరళలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కేరళలో తల్లి, కుమారుడు ఇద్దరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ విభాగంలో తల్లి బిందుకు 92వ ర్యాంక్ రాగా.. కుమారుడు వివేక్ లోయర్ డివిజన్ క్లర్క్ విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు. సాధారణ కుటుంబంలో ఇద్దరికీ ప్రభుత్వం ఉద్యోగం రావడంతో వారి ఆనందం చెప్పుకోలేనిది.

మలప్పురంలోని అరిక్కోడ్ అనే విలేజ్ లో వీళ్లు నివాసం ఉంటున్నారు. తల్లి వయస్సుగా 42 కాగా.. కొడుకు వయస్సు 24. తల్లి బిందు చాలారోజులుగా అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తుంది. అయితే మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టదల ఉంది. దీంతో ఎప్పటినుంచో పరీక్షలు రాస్తూ ఉంటుంది. ఆమె వయస్సు 42 కావడంతో ఈ సారి ఉద్యోగం సాధించకపోతే వయో పరిమితి దాటి పోతుంది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం రాయడానికి అర్హత పోతుంది. దీంతో చివరి ఛాన్స్ ను చక్కగా ఉపయోగించుకుని కష్టపడి చదివింది.

చివరికి కుమారుడితో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించి సక్సెస్ కొట్టింది. ఈ విషయం దేశవ్యాప్తంగా వార్తల్లో చక్కర్లు కొడుతోంది. తల్లీకొడుకు ఒకే కోచింగ్ సెంటర్ లో చేరారు. కలిసి రోజూ కోచింగ్ కు వెళ్లేవారు. తర్వాత ఎవరికి వారు ప్రిపేర్ అయ్యేవారు. ఏవైనా డౌట్స్ ఉంటే ఇద్దరం ఒకిరినొకరు అడిగేవారు. నోట్స్ లు ఎక్సేంజ్ చేసుకునేవారు.

తన అమ్మతో కలిసి చదవుకునేవాడినని, ఇద్దరం వివిధ అంశాలపై చర్చించుకునేవాళ్లమని కుమారుడు వివేక్ చెబుతున్నాడు. అమ్మ రోజూ చదువుకునేవారు కాదని, అంగన్ వాడీ ఉద్యోగం చేసిన తర్వాత ఖాళీ టైమ్ లో చదువుకునేవారని వివేక్ తెలిపాడు. తన తల్లికి, తనకు ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -