Jaya Bachchan: అమితాబ్ భార్య షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

Jaya Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయన సతీమణి జయ బచ్చన్ కూడా సుపరిచితురాలే. బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్‌లోనూ వీరి ఫ్యామిలీకి మంచి క్రేజ్ ఉంది. జయ బచ్చన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఏదో ఒక సెన్సెషనల్ ఆరోపణలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల దీపావళి వేడుకల సందర్భంగా కమెరామెన్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అనుమతి లేకుండా తమ వ్యక్తిగత విషయాల్లో, పర్సనల్ ఫోటోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జయబచ్చన్ తన మనవరాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనవరాలు నవ్య నవేలి నంద పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ముందుకు సాగాలంటే శారీరక ఆకర్షణ తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి.

కాగా, నవ్య ‘పోడ్ కాస్ట్.. వాది హెల్ నవ్య’లో జయబచ్చన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జయ బచ్చన్ తన మనవరాలితో మనసువిప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా జయబచ్చన్ మాట్లాడుతూ.. ‘సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడితే నన్ను అందరూ వ్యతిరేకిస్తారు. కానీ మనిషికి శారీరక ఆకర్షణ, ప్రేమ ఎంతో ముఖ్యమైనవి. మా కాలంలో మేము అలాంటి ప్రయోగాలు చేయలేదు. కానీ నేటి తరం అలా కాదు. అన్నీ సాహసాలు, ప్రయోగాలు చేయాలని అనుకుంటారు.

లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌కు కూడా బాధ్యత వహిస్తారు. శారీరక సంబంధం ఉంటేనే ఎక్కువ రోజులు కొనసాగుతున్నారు. ఓ అందమైన రిలేషన్‌షిప్ వారికి ప్రస్తుతం ఎంతో ముఖ్యం. నా మనవరాలు పెళ్లి చేసుకోకుండా పిల్లలను కన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.’ అని తెలిపారు. నేటి యువత గురించి పట్టించుకోవడమే మరిచామని జయ బచ్చన్ అన్నారు. నెక్ట్స్ జనరేషన్ కూడా కొత్త ఆలోచనలతో ముందుకు రానుంది. దానికి అందరం సిద్ధంగా ఉండాలన్నారు. ఒకవేళ శారీరక బంధం కుదరకపోతే అండర్‌స్టాండింగ్‌తో దూరం అవ్వాలని జయ బచ్చన్ చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -