Grandma: వయసు శరీరానికేగాని మనసుకు కాదని నిరూపించి అందరితో శభాష్ అనిపించుకుంటుంది ఓ బామ్మ. వయసు కేవలం నెంబర్ మాత్రమే అనే విషయానికి ఈమె పెర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా మారి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ అందరూ ఇంతలా ఆశ్చర్యపోయేలా ఈమె ఏం చేసిందని ఆలోచిస్తున్నారా.. ఈ విషయాన్నే ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా జరిగిన ఓ సంగీత్ ఫంక్షన్‌లో ఓ బామ్మ వేసిన స్టెప్పులు ఆ ఫంక్షన్‌కి వచ్చినవారినే కాకుండా అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశాయి. రెడ్ శారీ ధరించి ఈ వృధురాలు తన డ్యాన్స్‌తో ఆ ఫంక్షన్‌కు హుషారు తీసుకువచ్చింది. పంజాబి సాంగ్స్‌కు ఈమె వేసిన స్టెప్పులు అక్కడ ఉన్నవారందరని డ్యాన్స్ వేసేలా చేసాయి. బీట్‌కు అనుగుణంగా మంచి ఈజ్‌తో డ్యాన్స్ చేసి ఈ బామ్మ అందరితో శభాష్ అనిపించుకుంది.
శైల్ శర్మ అనే యూజర్ ఈ బామ్మ డ్యాన్స్ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్‌చేయడంతో ఈ వీడియో క్షణాలలో వైరల్‌గా మారిపోయింది. ఈ బామ్మ పేరు రేఖ అని తెలుస్తుంది. ఈమె ధోల్ జగీరో దా అనే పంజాబీ పాటకు తనదైన ఈజ్, గ్రేస్‌తో హుషారైన స్టెప్పులు వేసి అందర్నీ ఆకట్టుకుంది. దట్స్ హౌ షి స్టోల్ ది షో అనే క్యాప్షన్ కు వీడియోకు జతచేసి శైల్‌శర్మ ఈ వీడియోను షేర్ చేశారు.
View this post on Instagram
ఇప్పుడు ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బామ్మ డ్యాన్సుకు ఫిదా అవుతున్నారు. లేటు వయసులో లేటెస్ట్‌గా డ్యాన్స్ చేసిందని కొంతమంది ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరొకంతమంది ఈ బామ్మ ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌కి గట్టి పోటీ ఇస్తుందని అని కూడా కామెంట్ చేసి ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.