Granddaughter: మనవరాలికి జన్మనిచ్చిన నానమ్మ.. ఎందుకో తెలుసా?

Granddaughter: నేటి కాలంలో యవ్వనంగా ఉండి కూడా తన బిడ్డలనే కడుపులో మోయలేక అద్దె గర్భలపై చాలా మంది ఆదారపడి పిల్లలను కనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో 56 ఏళ్లు ఉన్న ఓ మహిళ తన కొడుకుకు పుట్టబోయే బిడ్డను తొమ్మిది నెలలు కడుపులో పెంచి జన్మనిచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

అమెరికాలోని ఉటా ప్రాంతంలో నివసిస్తున్న 56 ఏళ్ల మహిళ సరోగసి విధానంలో కొడుకుకి బిడ్డను కని అప్పగించింది. అప్పటికే నలుగురు సంతానం కలిగిన తన కొడుకుకు 5వ సంతానం కావాలని ముచ్చట పడ్డాడు. అయితే కోడలి గర్భసంచి తొలగించడంతో తన గర్భంలోనే మనవరాలిని బిడ్డగా పెంచి కొడుకు చేతిలో పెట్టింది. ఉటా ప్రాంతంలో నివసిస్తున్న వెబ్‌ డెవలపర్‌ గా పనిచేస్తున్న జెఫ్‌ హాక్‌ కేంబ్రియా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. అయితే జెఫ్‌ హాక్‌కి మరో బిడ్డ కావాలని కోరిక ఉంది. అయితే హుక్‌ భార్య గర్భసంచిని డాక్టర్లు తొలగించడంతో వేరే మార్గం లేక అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మ ఇవ్వాలనుకున్నారు దంపతులు. ఈ విషయంలో బయట వ్యక్తులను ఎక్కువగా సంప్రదిస్తారు. కాని జెఫ్‌హాక్‌ దంపతులు బిడ్డ కోసం మదనపడటం చూసి జెఫ్‌హాక్‌ తల్లి నాన్సీ హాక్‌ సరోగసీ విధానంలో తన కొడుకు సంతాన్ని తన గర్భంలో మోసేందుకు ముందుకొచ్చింది.

56 ఏళ్ల నాన్సీ హాక్‌ ఉటా టెక్‌ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. కోడలికి గర్భసంచి తొలగించడంతో నాయనమ్మ గర్భంలోకి ఫలదీకరణం చెందిన అండాలను ప్రవేశపెట్టారు. 9నెలల పాటు తన గర్భసంచిలో కొడుకు బిడ్డను మోసిన నాన్సీ హాక్‌ నవంబర్‌ 2న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకుకి మనవరాలిని కని ఇచ్చిన మాతృమూర్తి చేసిన త్యాగం, ఆమె పంచిన ప్రేమను చూసి కొడుకు జెఫ్‌ హాక్, కోడలి కేంబ్రియా తమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. ఐదో సంతానంగా కలిగిన పాపకు హన్నా అని పేరు పెట్టారు. ఇంకా విచిత్రం ఏమిటంటే గర్భంలో ఉండగానే కొడుకు, కోడలికి నాన్సీ హాక్‌ పుట్టబోయేది ఆడపిల్లేనని ముందుగానే చెప్పడంతో వారి ఆనందానికి అంతూ లేకుండా పోయిందని ఓ మీడియా ముందు వివరించారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -