Adipurush Movie: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మారిన ప్రభాస్ అభిమానుల పరిస్థితి?

Adipurush Movie: సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా టీజర్ విడుదలయితే.. ఆ టీజర్ ఆ సినిమా అంచనాలను మరింత పెంచాలి. కానీ ప్రభాస్ ఆది పురుష్ సినిమా మాత్రం ప్రేక్షకులకు మరీ చిన్న చూపుగా మారింది. ఆ సినిమా టీజర్ ను ప్రస్తుతం ఒక రేంజ్ లో ట్రోలర్స్ ఏకీపారేస్తున్నారు. యానిమేషన్ గ్రాఫిక్స్ లో ఈ సినిమా తీశారని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా టీజర్ విషయంలో ప్రభాస్ అభిమానులు కంట కన్నీరు పెట్టుకున్నట్లయ్యింది.

ఇక ప్రభాస్ అభిమానులు ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ సంస్థ కనపడితే చెట్టుకు కట్టి కొట్టేసే అంత కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్.వై.వి.ఎఫ్.ఎక్స్ వాలా అనే గ్రాఫిక్ సంస్థ ఆది పురుష్ సినిమాకు పని చేసింది మేము కాదని ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ఇక ప్రభాస్ అభిమానులు ఈ ట్విట్టర్ ఖాతాలో మరింత లోతుగా పరీక్షించారు. ఎన్ వై వి ఎఫ్ ఎక్స్ లో ప్రసాద్ సుతార్.. ఆది పురుష్ నిర్మాణంలో ఒకరిని ప్రభాస్ అభిమానులు తెలుసుకున్నారు.

ఇక ప్రసాద్ ట్విట్టర్ అభిమానులు చెక్ చేయగా ఆ పేజీలో ఉన్న కవర్ ఫోటో ఆది పురుష్ టైటిల్ లోగో లా కనిపిస్తుంది. ఇక ప్రసాద్ సుతార్ కూడా తన ట్విట్టర్ లో అయోధ్యకి వెళ్ళినట్లు ఫోటో ఒకటి ట్వీట్ చేసాడు. ఇది గమనించిన ప్రభాస్ అభిమానులు ఏమనాలో తెలియక తల పట్టుకున్నారు. ఈ విషయం తెలియగానే ప్రభాస్ అభిమానుల పరిస్థితి మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టు అయ్యింది.

ఏదేమైనా ఆది పురుష్ టీజర్ విడుదల కావడం ప్రభాస్ అభిమానులకు పెద్ద ఎత్తున మనేదిగా మారింది. ప్రభాస్ కూడా ఈ విషయంలో డైరెక్టర్ ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా నడుస్తున్నాయి. మరి బాహుబలి సిరీస్ తర్వాత వరుస ప్లాపులు ఎదుర్కొంటున్న ప్రభాస్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇంకా ప్రభాస్ అభిమానులను మాత్రం అటు కోలీవుడ్ ప్రేక్షకులు కూడా బాగా దెప్పి పొడుస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -