Akki Roti: ఆ రోటి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలట!

Akki Roti: రోజూ ఇళ్లలో వండే ఆహార పదార్థాలు తింటే కాస్త బోరుగా అనిపిస్తోంది. బయట తిందామా అంటే వామ్మో జింగ్‌ ఫుడ్‌ తింటే లావుతామని భయపడుతుంటారు. అయిన నాలుకకు రోజుకొక కొత్త రుచి చూడాలనిపిస్తోంది. దీంతో వెరైటీ వెరైటీ ఆహారాన్ని తినాలని మనస్సు ఊవిళ్లురుతోంది. ఎక్కువగా తింటే లావై వివిధ రకాల ఆసనాలు, వ్యాయామాలు చేయాల్సి వస్తోంది. లేదంటే తరచూ వైద్యులను సంప్రదించాల్సి వస్తోంది. అయితే.. ఈ వంటకాన్ని తయారు చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తోందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్‌ పీస్‌ అక్కి రోటీ తింటే చాలా రుచిగా ఉంటుందట.

కావాల్సిన పదార్థాలు..
కప్పు బియ్యప్పిండి
కప్పు పచ్చి బఠాణీ
ఒక ఉల్లిపాయ (తరిగింది)
మూడు టీ స్పూన్ల కొత్త మీరా తిరుగు
మూడు పచ్చిమిర్చి (తరగాలి)
ఒక టీ స్పూన్‌ జీలకర్ర
రెండు రెమ్మల కరివేపాకు
తగినంత ఉప్పు
ఒక టీ స్పూన్‌ నూనె

తయారు చేసే విధానం..

బఠాణీలను కడిగి ఉడికించి, నీటిని మరో పాత్రలోకి వంపి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యం పిండి, జీలకర్ర, మిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే బఠాణీలు ఉడికించిన నీటిని తగినంత తీసుకుంటూ గారెల పిండిలా కలపాలి. అరిటాకు లేదా పాలిథిన్‌ పేపరు నూనె రాసి పై మిశ్రమాన్ని పెద్ద ఉల్లిపాయంత తీసుకుని సమంగా అరిశెలాగ వత్తాలి. మధ్యలో ఐదారు చోట్ల చిల్లు పెట్టాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి ఈ రోటీని పేపర్‌ మీద నుంచి జాగ్రత్తగా పెనం మీదకు జార్చాలి. మంట చిన్నగా పెట్టి రెండు వైపులా కాలిస్తే గ్రీన్‌ పీస్‌ అక్కి రోటీ రెడీ.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -