Green Vegetable: పచ్చి కూరగాయలు తింటే ఆ సమస్యలు రావట!

Green Vegetable: మాంసాహారం కన్నా కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయల్లో అధిక విటమిన్లు, ఉంటాయని వాటిని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే.. వండిన కూరగాయల కాన్నా.. పచ్చివే తింటే ఎక్కువ పోషక విలువలు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. మన పూర్వీకులు నాడు ఎక్కువగా పచ్చి కూరగాయలు తినడంతోనే నేడు ఏడు పదుల వయసు వచ్చినా కూడా ఆరోగ్యంగా బలవంతంగా ఉంటారని గుర్తు చేస్తున్నారు. పచ్చి కూరగాయలు ఎక్కువ పైబర్, పోషకాలను అందిస్తాయి. అందువల్ల వండిన వాటి కంటే పచ్చి కూరగాయలనే ఎక్కువ తినాలి.

పచ్చి కూరగాయల్లో పోషకాలను ఎక్కువగా ఉంటాయి. మనం కూరగాయలను ఉడికించడం వల్ల విటమిన్స్, మినరల్స్‌ వంటి సహజ ఎంజైమ్స్‌ అన్నీ పోతున్నాయి.అంతేకాకుండా, నూనె, మసాలాలు ఆహారాల పోషకాలను ప్రభావితం చేస్తాయి.కూరగాయల్లోని పోషకాలు పోవడానికి గల కారణం వాటిని మనం అతిగా ఉడికించడం. చాలా మంది కూరగాయలను ముందుగా కట్‌ చేసి ఆ తర్వాత వాటిని కడిగి కూర చేసుకుంటారు.అలా కడిగినప్పుడు పోషకాలన్ని బయటకు వెళ్లిపోతాయి.

దీనికి బదులు ముందుగానే కూరగాయలను కడగడం మంచిది.అప్పుడు అందులోని ఫైబర్‌ కూడా అలానే ఉంటుంది.అదే విధంగా చాలా మంది కూరగాయలను గంటల తరబడి నీటిలో నానబెట్టి రెండు నుంచి మూడు సార్లు రుద్ది రుద్ది అడుగుతుంటారు. అలా కడిగితే వాటిలో ఉండే పోషకాలన్నీ నీటిలో కలిసిపోతాయట. ఎక్కువ శాతం కూరగాయాలను నానబెట్టకూడదు. ఎందుకంటే కూరగాయల్లో అప్పటికే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలా నానబెట్టడం వల్ల ఖనిజాలన్ని బయటకు పోతాయి. ఎక్కువగా తినకున్నా పర్వాలేదు కొంచెం కొంచమైనా పచ్చికూరగాయలనే∙తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -