Group-1 Prelims: గ్రూప్1 ప్రిలిమ్స్ రద్దుతో యువతి కంటతడి.. ఏమైందంటే?

Group-1 Prelims: ప్రస్తుత రోజుల్లో చాలామంది యువతకు చదువు అంటే చిన్న చూపు అయ్యింది. చదువుకోవడానికి డబ్బు ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా కూడా కొంతమంది చదువు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది బీద వాళ్ళు ఏమీ లేకపోయినా కూడా చదువుపై ఆసక్తితో కష్టపడి చదువుతూ ఉంటారు. అలాగే ఒక యువతి విషయంలో కూడా అదే జరిగింది. ఒక యువతిని విధి చిన్న చూపు చూసింది. పుట్టుకతోనే చెవులు సరిగా వినబడవు. మాటలు కూడా సరిగా రావు.

ఈ వైకల్యం కారణంగా బాల్యం నుంచి అనేక అవమానాలను ఎదుర్కొంది. ఎంతో కుంగిపోయింది. కానీ ఆ యువతికి తల్లి ధైర్యం చెప్పింది. కూతురిని బాగా ప్రోత్సహించింది. తల్లి, తండ్రి చూపిన ప్రేమ, ఇచ్చిన మద్దతుతో ఆ యువతి అవమానాలను పట్టించుకోకుండా జీవితంలో ముందుకు వెళ్లింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సరే చదువే తన భవిష్యత్తుకు బలమైన ఆధారం అని నమ్మింది. అనుకున్నట్లే బాగా చదువుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యింది.

 

ఈ క్రమంలోనే తాజాగా టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కూడా అయ్యింది. కానీ పరీక్ష రద్దుతో ఆ యువతి జీవితం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. ఉండటానికి ఇల్లు కూడా లేని తాను మళ్లీ పరీక్షకు మొదటి నుంచి సిద్ధం కావడం అంటే అది తన తలకు మించిన భారమని దాతలు ఆదుకోవాలని కోరుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతి పేరు భవాని. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శాంతి నగర్‌ కాలనీకి చెందిన మల్లయ్య, తిరుపతమ్మలకు ఇద్దరు కుమార్తెలు కాగా చిన్న కుమార్తె భవాని.

 

ఆమెకు బాల్యం నుంచి చెవుడు. మాటలు సరిగా రావు. అయినా సరే పట్టుదలతో బాగా చదువుకుంది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యింది. కానీ పేపర్‌ లీకేజ్‌ కారణంగా పరీక్ష రద్దయ్యింది. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న ఆ యువతి మళ్లీ మొదటి నుంచి పరీక్షకు సిద్ధం కావాలంటే ఎంతో కష్టమని తనకు కనీసం ఇల్లు కూడా లేదని దాతలు ఎవరైనా తనను ఆదుకోవాలని తన కల నిజం చేసుకునేందుకు సాయం చేయాలని వేడుకుంటోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -