Guinness Record: అయ్య బాబోయ్.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు అంతమంది హాజరయ్యారా?

Guinness Record: ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఐపీఎల్‌కు ఉన్నంత క్రేజ్ ఇతర టోర్నీలకు లేదు. ఐపీఎల్‌లో రాణిస్తే డబ్బుతో పాటు క్రేజ్ కూడా సొంతం అవుతుంది. అందువల్ల విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు. పాకిస్థాన్ ఆటగాళ్లు తప్పితే మిగతా అన్ని దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశం ఉంది. తాజాగా ఐపీఎల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతమైంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరుకావడంతో బీసీసీఐకి గిన్నిస్ బుక్ పురస్కారం లభించింది.

ఐపీఎల్ సందర్భంగా ఈ ఏడాది మే 29న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ అంతర్జాతీయ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 1,01,566 మంది అభిమానులు ప్రత్యక్షంగా చూశారు. ఓ క్రీడా ఈవెంట్‌కు ఇంతమంది హాజరుకావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కింది. బీసీసీఐ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.

ఐపీఎల్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జాస్ బట్లర్ చేసిన 39 పరుగులే అత్యధిక స్కోరు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, సాయికిషోర్ 2 వికెట్లు తీశారు. 131 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ 18.1 ఓవర్లలో ఛేదించింది. శుభ్‌మన్ గిల్ 45 పరుగులతో రాణించాడు. హార్దిక్ పాండ్యా 34, డేవిడ్ మిల్లర్ 32 పరుగులతో రాణించారు. దీంతో బరిలోకి దిగిన తొలిసారే గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ సొంతం చేసుకుంది.

గిన్నిస్ బుక్ రికార్డు ప్రతి భారతీయుడికి గర్వకారణం
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు గిన్నిస్ రికార్డు రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని బీసీసీఐ ట్వీట్ చేసింది. క్రికెట్ అంటే భారత అభిమానులకు ఉన్న పిచ్చి, వారిచ్చిన తిరుగులేని మద్దతుకు లభించిన పురస్కారం అని… అందరికీ అభినందనలు అంటూ బీసీసీఐ తన ట్వీట్‌లో ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాగా గతంలో అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియం సీటింగ్ కెపాసిటీ 49 వేలు మాత్రమే ఉండేది. అయితే స్టేడియాన్ని ఆధునీకరించిన తర్వాత లక్షా 32 వేలకు సీటింగ్ కెపాసిటీ పెరిగింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -