GunaShekar: గుణశేఖర్ అల్లుడు ఇంత తోపా.. అన్ని రూ.కోట్ల ఆస్తి ఉందా?

GunaShekar: వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న డైరెక్టర్ గుణశేఖర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల విషయంలోనే కాదు తన నిజ జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పుడు కొద్దిగా క్రేజ్ తగ్గింది కానీ ఒకప్పుడు తన సినిమాలతో ఎందరో హీరోలకు లైఫ్ ఇచ్చి స్టార్ హీరోలుగా మలచిన డైరెక్టర్ అతను.

అతను తీసిన ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో ఒక్కడు ఒకటి. ఈ మూవీతో మహేష్ బాబు కు మాస్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు స్టార్ హీరోగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గుణశేఖర్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సైనికుడు, అర్జున్‌ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

రీసెంట్ గా గుణశేఖర్‌ తన కూతురు నీలిమగుణ వివాహాన్ని ఫలక్నామా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ వేడుకకు ఎందరో సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో అసలు గుణశేఖర్ అల్లుడు ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏమిటి అని ఎందరో నెట్ లో ఆరా తీశారు.

గుణశేఖర్ అల్లుడు ర‌వి ప్ర‌ఖ్యా. ఈయన తండ్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యావేత్త, వ్యాపార వేత్త అయిన డాక్టర్‌ రామకృష్ణ. వీరి కుటుంబం ఎన్నో వ్యాపారాలలో రాణిస్తోంది. శ్రీ శ‌క్తి గ్రూప్ వీరి కుటుంబానికి సంబంధించిన సంస్థ. ఎన్నో కోట్లకు అధిపతి అయిన ర‌వి ప్ర‌ఖ్యా గుణశేఖర్ అల్లుడు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇటు గుణశేఖర్‌ కూడా బాగానే సంపాదించారు. చాలా మటుకు ఆయన చిత్రాలకు ఆయనే ప్రొడ్యూసర్ గా వ్యవహరించే వాడు కాబట్టి బాగానే ప్రాఫిట్స్ వచ్చేవి. ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనింగ్ బాధ్యతలు కూడా అతని భార్య నిర్వహించేది. ప్రస్తుతం ఆయన పెద్ద కుమార్తె నీలిమ తండ్రి చిత్రాలకు నిర్మాతగా పనిచేయాలి అని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -