Axar Patel: ఏడో స్థానంలో హాఫ్ సెంచరీ.. అక్షర్ పటేల్ అరుదైన రికార్డు

Axar Patel: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 31 బంతులే ఎదుర్కొన్న అక్షర్ పటేల్ ఏకంగా 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. దీంతో భారత్ తరఫున ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా అక్షర్ పటేల్ నిలిచాడు. ఇప్పటివరకు ఏడో స్థానంలో బరిలోకి దిగి 65 పరుగులు ఎవరూ చేయలేదు.

 

గతంలో ఈ రికార్డు జడేజా పేరిట ఉండేది. అతను కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 23 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పుడు అక్షర్ పటేల్ జడేజాను అధిగమించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒక భారత ఆటగాడు హాఫ్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం.

 

ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో అక్షర్ పటేల్ 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మరో 12 బంతుల్లోనే మిగతా 42 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీనికోసం అతను కేవలం 20 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇది భారత్ తరఫున ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ. అదే సమయంలో ఆరు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాళ్లలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.

 

జడేజాకు పోటీ ఇస్తాడా?
ప్రస్తుతం టీమిండియాకు గాయం కారణంగా జడేజా దూరం కావడంతో అతడి స్థానాన్ని అక్షర్ పటేల్‌తో భర్తీ చేస్తున్నారు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని జడేజా జట్టులోకి వస్తే అక్షర్ పటేల్‌ను తుదిజట్టులోకి తీసుకుంటారా అంటే ఆలోచించాల్సిందే. ఈ ఏడాది ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు ఉండటంతో ఆల్‌రౌండర్ స్థానాన్ని జడేజాతో భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి జడేజా, పాండ్యా లాంటి ఆల్‌రౌండర్లు ఉంటే అక్షర్ పటేల్‌ను సెలక్టర్లు కరుణిస్తారో లేదో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -