Kiraak RP: వామ్మో.. కర్రీ పాయింట్ తో ఆర్పీ ఆదాయం మామూలుగా లేదుగా!

Kiraak RP: సినీ పరిశ్రమలో చాలా మంది ఇటు సినిమాలు చేస్తూనే అటు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. సెలబ్రిటీలు వ్యాపారంలో అంతగా సక్సెస్ కాలేరని ఎప్పటి నుంచో వినిపిస్తోన్న వాదన. అయితే ఇప్పటికే కొందరు స్టార్ హీరోలు ఫుడ్ బిజినెస్ లు చేస్తూ లాభాలు పొందుతున్నారు. కానీ వాటికి సంబంధించిన ప్రచారం మాత్రం అంతగా చేసుకోవడం లేదు. సెలబ్రిటీలు సరైన విధంగా పబ్లిసిటీ చేసుకుంటే ఫుడ్ బిజినెస్ లో సక్సెస్ సాధించవచ్చని కిరాక్ ఆర్పీ తెలుపుతున్నాడు.

 

పలు కామెడీ షోస్ లో కిరాక్ ఆర్పీ మెరిశాడు. జబర్దస్త్ షో ద్వారా అందరికీ పరిచయం అయ్యాడు. ఆయన స్కిట్లు చేయడమే కాదు ఒకానొక టైంలో జబర్దస్త్ పెద్దలపై కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవే ఆయనకు అవకాశాలు లేకుండా చేశాయి.

తాజాగా కిరాక్ ఆర్పీ హైదరాబాద్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో ఫుడ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఈ వ్యాపారం కోసం ఆర్పీ 40 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాడు. అయితే ఇప్పటికే తాను పెట్టిన పెట్టుబడి రికవరీ అయినట్లు తెలుస్తోంది. ఆర్పీ కర్రీ పాయింట్ ముందు భోజన ప్రియులు క్యూ కడుతున్నారు. భోజన ప్రియులను కంట్రోల్ చేయడానికి ఆర్పీ బౌన్సర్లను కూడా నియమించారనే టాక్ వినిపిస్తోంది.

 

దీన్నిబట్టి చూస్తే ఈ బిజినెస్ ఏ స్థాయిలో క్లిక్ ఆయిందో తెలుస్తోంది. మధ్యతరగతికి అనుకూలంగా రేట్లు ఉండటంతో ప్రజలు ఆర్పీ కర్రీపాయింట్ కు క్యూ కడుతున్నారు. ఆ రకంగా ఆర్పీ సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. యూట్యూబ్ ఛానెల్స్ లో ఆర్పీ రెస్టారెంట్ గురించే వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. విమర్శించిన వాళ్లే మెచ్చుకునేలా ఆర్పీ ఎదిగి చూపించడాని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచ్ లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్పీ తెలిపారు. ప్రస్తుతం ఆర్పీకి ఈ వ్యాపారం ద్వారా రోజుకు 2 లక్షల వరకూ ఆదాయం వస్తోందని, ఈ లెక్కన చూస్తే నెలకు 50 నుంచి 60 లక్షలు ఆర్పీ సంపాదిస్తున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -