Hansika: ఆ హీరోలతో హీరోయిన్ హన్సిక ప్రేమాయణం నడిపిందా?

Hansika: కోలీవుడ్ హీరోలు, హీరోయిన్ల ప్రేమ కథలు వరుసగా ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. హీరో విశాల్ ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని.. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్, ప్రముఖ హీరోయిన్ మంజిమా మోహన్ తో ప్రేమలో ఉన్న విషయం కూడా బయటికి వచ్చింది. వీరిద్దరూ కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని ఇప్పటికే సహజీవనం కూడా చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. హీరోయిన్ మంజిమా కూడా తాము పీకల్లోతు ప్రేమలో ఉన్నామని ప్రకటించింది.

 

మరో హీరోయిన్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది . ఆ హీరోయిన్ ఎవరో కాదు. యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని. హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. డిసెంబర్ 4వ తేదీన హన్సిక తన ప్రియుడుతో మూడు ముళ్ళు వేయించుకోబోతోంది.

 

హన్సిక ప్రేమాయణాలు నడిపిన హీరోలు వీళ్లే

ముందుగా హ‌న్సిక కోలీవుడ్ హీరో శింబుతో బ్రేకప్ తర్వాత మరో కోలీవుడ్ యంగ్ హీరో జయం రవితో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. జయం రవి, హన్సిక కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వచ్చాయి. అయితే అప్పటికే జయం రవికి పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత హన్సిక ప్రస్తుత తమిళనాడు ఎమ్మెల్యే, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో కూడా ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయి.

 

హన్సిక ప్రియుడు ఎవరు?

సోహైల్ – హన్సిక ముందు నుంచి మంచి స్నేహితులు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ వ్యాపారాలను విస్తరించే క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోయారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసింది హ‌న్సిక-సోహైల్ జంట. ఇక తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ డిసెంబర్ 4న జైపూర్ లోని ఓ ప్యాలెస్ లో పెళ్లి చేసుకోబోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -