Hansika: హన్సిక శోభనం ఖర్చు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Hansika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్‌గా తాను ప్రేమించిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో హన్సిక హీరోయిన్‌గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమా మంచి హిట్ అందుకోవడంతో.. హన్సికకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోయింది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

అయితే టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గడంతో తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. తాజాగా ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహల్ ఖతూరియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హన్సిక తన పెళ్లి కన్నా మొదటి రాత్రి కోసం భారీగా డబ్బులు ఖర్చు చేసిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.

 

అయితే హన్సిక పెళ్లికి కట్టుకున్న చీరలు, నగలు రాయల్ పద్ధతిలో డిజైన్ చేయించుకుందని సమాచారం. అయితే హన్సిక తన ఫస్ట్ నైట్ కోసం రూమ్‌ని డెకరేషన్ చేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేస్తోందట. ఫస్ట్ నైట్ కోసం గది అలంకారానికి అయ్యే పూల ఖర్చే ఎక్కువగా అయిందని తెలుస్తోంది. దాదాపు 100 రకాల పూలను ప్రత్యేకంగా విదేశాల నుంచి తెప్పిస్తున్నారట.

 

ఈ పూలతోనే రూమ్‌ని డెకరేట్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్త విన్న నెటిజన్లు షాకవుతున్నారు. ఫస్ట్ నైట్ పూల కోసం ఇంత ఖర్చు చేస్తోందా అని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు లైఫ్‌లో ఒకేసారి వచ్చే స్పెషల్ వెకేషన్ కోసం ఎంత డబ్బులు ఖర్చు చేసినా తక్కువేనని చెబుతున్నారు. కాగా, హన్సిన-సోహెల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -