Hansika: వైరల్ అవుతున్న హన్సిక పెళ్లి ఫోటోలు.. క్యూట్ జోడీ అంటూ?

Hansika: హీరోయిన్‌ హన్సిక తాజాగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కథారియాను హన్సిక ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం వీరిరువురూ డిసెంబర్‌ 4న ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో సెలబ్రిటీలు చాలా మంది పాల్గొని నూతన జంటను అభినందనలతో ముంచెత్తారు. భారీ సెట్టింగులతో వీరి వివాహ వేదిక రిచ్‌గా కనిపించింది. జైపూర్‌లోని రాజకోటలో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఒక్కటయ్యారు.

హన్సిక సంగీత్‌ కార్యక్రమాన్ని కూడా కుటుంబం, సన్నిహితులు ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్‌ నటించిన దేశ ముదురు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. తర్వాత అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన దేశముదురు సినిమా అనేక సంచలనాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

వరుడితో కలిసి డ్యాన్స్‌ చేసింది హన్సిక. సంగీత్‌ కార్యక్రమంలో రెడ్‌ కలర్ వర్క్‌ లెహెంగాలో హన్సిక, సిల్వర్, వైట్ కలర్ షేర్వానీలో సోహైల్ కలర్‌ఫుల్‌గా కనిపించారు. హన్సిక పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జైపూర్‌లోని వందల ఏళ్ల కిందట నిర్మించిన రాజకోటలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.

సింధీ సంప్రదాయం ప్రకారం..
ఇక పెళ్లి కూతురి గెటప్‌లో హన్సికను చూసిన అభిమానులు సంబరపడిపోయారు. గులాబీలతో అలంకరించిన పల్లకిపై పెళ్లికూతురు అలంకారంలో వివాహ వేదిక వద్దకు వచ్చిన హన్సిక మెడలో పూల దండ వేసి నుదుటన సింధూరం పెట్టాడు వరుడు. ఈ క్రమంలో అందరూ ఎమోషనల్‌ అయ్యారు. పెళ్లి వేడుక తర్వాత హన్సిక, సోహైల్‌ జంట ఊరేగింపు నృత్యాలు కూడా చేశారు. మొత్తానికి ఈ వేడుక ఓ పండగలా సాగిపోయింది. సింధీ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -