Hansika Motwani: అభిమానులకు తీపికబురు చెప్పిన హన్సిక.. ఏం చెప్పారంటే?

Hansika Motwani: రీసెంట్ గా పెళ్లి చేసుకున్న హన్సిక మోత్వాని తన మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంది. ఆమె తన బిజినెస్ పార్ట్నర్ మరియు ఫ్రెండ్ అయిన సోహెల్ ఖతూరియను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ల ప్రేమాయణం ఎన్నో రోజుల నుంచి గడుస్తున్నప్పటికీ ఆ విషయాన్ని హన్సిక ఎంతో గోప్యంగా ఉంచింది.

 

పెళ్లికి ఇంకొక నెల ఉంది అనగా ఖతూరియా ఈఫిల్ టవర్ దగ్గర తనకు ప్రపోజ్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఐ లవ్ యు టూ అంటూ హన్సిక అందరి సాక్షిగా తన ప్రేమను తెలిపింది. ఆ తర్వాత డిసెంబర్ 5న ఒక గ్రాండ్ డ్రీమ్ వెడ్డింగ్ ను రాయల్ ప్యాలెస్ లో హన్సిక ఆర్గనైజ్ చేసుకుంది. ఆమె హెల్దీ ఫంక్షన్ నుంచి పెళ్లి రిసెప్షన్ వరకు అన్ని ఎంతో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఆమె తన అత్తగారింట్లో ఎంతో హ్యాపీగా ఉంది అని సమాచారం.

 

ఈ నేపథ్యంలో పెళ్లి అయిన తర్వాత హన్సిక తన కెరీర్ కు గుడ్ బాయ్ చెప్పబోతోంది అన్న పుకార్లు వచ్చాయి. అయితే హన్సిక వీటన్నిటినీ కొట్టి పడేస్తూ, త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్తాను అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ క్రమంలో హన్సిక కోలీవుడ్ లో ఒక స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో లేడీ ఓరియంటెడ్ ఫిలింకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

 

పెళ్లికి ముందే తన సినీ కెరీర్ కు ఎటువంటి ఇబ్బంది కలుగనివ్వనని సోహెల్ ఖతోరియా ఆమెకు మాట ఇచ్చాడట. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసే దానికి అతను ఒప్పుకోవడం తో హన్సిక ఈ మ్యారేజ్ కి సిద్ధపడింది. మరోపక్క హన్సిక తన భర్త బిజినెస్ కు సంబంధించిన పనులను కూడా స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పెళ్లి అయిన నెల రోజులకే తన కొత్త సినిమా గురించి గుడ్ న్యూస్ చెప్పిన హన్సిక స్పీడ్ కు జనాలు ఆశ్చర్యపోతున్నారు. రాబోయే రోజులలో ఈ ముద్దుగుమ్మ నుంచి మరిన్ని గుడ్ న్యూస్ లు అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts