Hansika: బ్యాచిలర్ పార్టీలో హన్సిక చేసినపని తెలిస్తే షాకవ్వాల్సిందే!

Hansika: అందాల తార హన్సిక గురించి తెలిసిందే. బాల నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. సౌత్ ఇండియన్ స్టార్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2001లో ‘షకలక బూమ్ బూమ్, హమ్ దో హై’ సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. బాలీవుడ్‌లో ‘హవా, కోయ్ మిల్ గయా, అబ్రక దబ్రా, జాగో’ వంటి సినిమాల్లో నటించింది. 2007లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా మంచి హిట్ అవ్వడంతో.. హన్సికకు టాలీవుడ్‌లో భారీగా అవకాశాలు పెరిగాయి. ఎన్టీఆర్‌తో కలిసి ‘కంత్రి’, రామ్‌తో కలిసి ‘మస్కా’ సినిమాలు చేసింది. ‘బిల్లా, జయీభవ, సీతారాముల కళ్యాణం’ వంటి సినిమాల్లో నటించినా.. క్రమంగా ఆమెకు ఆఫర్లు రావడం తగ్గాయి. దాంతో తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులేసింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో.. ‘కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, సమ్‌థింగ్.. సమ్‌థింగ్, సింగం-2’ సినిమాల్లో నటించింది.

 

 

ఈ మధ్యకాలంలో సినిమాల వైపు హన్సిక ఇంట్రెస్ట్ చూపనట్లు తెలుస్తోంది. హన్సిక తన బిజినెస్ పార్టనర్, స్నేహితుడు సోహైల్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుంది. వచ్చే ఏడాది 4వ తేదీన హన్సిక-సోహైల్ రాజస్థాన్‌లో పెళ్లి చేసుకుని ఒక్కటి కానున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజాగా హన్సిక తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో హన్సిక వేసుకున్న డ్రైస్‌పై అందరూ చర్చించుకుంటున్నారు. పార్టీలో హన్సిక గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. పొట్టి దుస్తులు ధరించి కేక పుట్టిస్తోంది. సినిమాల్లో కంటే అందంగా తయారైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న హన్సికకు అభిమానులు, సెలబ్రిటీలు అడ్వాన్స్ గా శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, హన్సిక సినిమాలకు దూరమవుతుందనే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పెళ్లి తర్వాత సినిమాలు చేయాలా? వద్దా? అనే విషయంపై హన్సిక త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -