Harasment: ఇలాంటి కొడుకు ఏ కన్నతల్లికి ఉండకూడదు.. పాపం నడిరోడ్డుపైనే జుట్టు పట్టుకొని మరి!

Harasment: అందుకే అంటారేమో.. ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళినా కూడా అమ్మా నాన్న పై ప్రేమలు చూపిస్తుంది అని. అదే కొడుకు అయితే కన్నతల్లిదండ్రులకు కూడా అన్నం పెట్టకుండా వాళ్ళను నడిరోడ్డున వదిలేస్తారు. ఈ మధ్యకాలంలో మాత్రం ఎంతోమంది తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళలా రోడ్లపై తిరుగుతున్నారు. కారణమేంటంటే కన్న కొడుకులే.

 

ఇలాంటి కొడుకులు ఉంటే మాత్రం ఏ తల్లిదండ్రులైన ఇంట్లో ఉండలేరు. ప్రతిరోజు నిత్యం కొడుకులతో ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న బాధలు ఇవే. తాజాగా ఓ కసాయినా కొడుకు కన్నతల్లి అని చూడకుండా నడిరోడ్డుపై జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి ఘోరంగా కొట్టాడు. అసలు వాడు మనిషేనా.. వాడికి ఏం పోయేకాలం వచ్చింది. తన కన్నతల్లిని అలా కొట్టడం వాడికి చేతులు ఎలా వచ్చాయో.. ఏమో.. అసలేం జరిగిందంటే..

 

ఉత్తర్ ప్రదేశ్ లో మహారాజు గంజ్ లో రితేష్ వర్మ అనే కసాయి కొడుకు తన కన్నతల్లిని ఘోరంగా కొట్టాడు. రోడ్డుపైకి లాక్కొని వచ్చి కాలితో తన్నాడు. ఆమె ఏడుస్తూ అలమటించిన కూడా ఆ కసాయి వాడు మాత్రం ఏమాత్రం కనికరం చూపించకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఆ తల్లి కొట్టొద్దు అని ఎంత వేడుకున్నా కూడా ఆ కసాయివాడు కాలితో కడుపు మీద, ముఖం మీద తన్నాడు.

 

అడ్డొచ్చిన వ్యక్తిని కూడా పక్కకు నెట్టేశాడు. ఆ తల్లి స్పృహ తప్పి ఆ రోడ్డుపైనే పడిపోయింది. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్ళగా అక్కడున్న స్థానికులు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. అతడు తన తల్లిని కొట్టడానికి కారణం.. కొడుకు ఖర్చుపెట్టిన డబ్బులు లెక్క చెప్పమన్నందుకు ఆ నిందితుడు అలా ప్రవర్తించాడని తెలిసింది. ఇక పోలీసులకు విషయం తెలియడంతో వెంటనే ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ లు కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈనెల 23న జరగగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -